దీనస్థితిలో ఉన్న ఏషియన్ గేమ్స్ మోడల్ విన్నర్.. హైపర్ ఆది చేసిన పనికి ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు..

బుల్లితెరపై మోస్ట్ ఎంటర్టైనర్ కామెడీ షో గా వచ్చిన శ్రీదేవి డ్రామా కంపెనీ ఏ రేంజ్ లో సక్సెస్ అందుకుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే తాజాగా ఈ షోకు సంబంధించిన లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయింది. ఇందులో హైలెట్ ఏంటంటే షో కి ఊహించని సెలెబ్రిటీలు.. గెస్ట్లుగా వచ్చి సందడి చేశారు. రష్మీ, హైపర్ ఆది, ఆటో రామ్ ప్రసాద్.. త‌దిత‌రులు ఎప్పటికప్పుడు షో ద్వారా ఎంటర్టైన్ చేస్తూనే ఉంటారు. అయితే ఈసారి ఈ షోలో వీరితోపాటు అతిధులుగా బిగ్ బాస్ శివాజీ, ఫుడ్ స్టాల్ తో భారీ పాపులార్టి దక్కించుకున్న కుమారి ఆంటీ, అలాగే ఏషియన్ గేమ్స్ లో బ్రాంజ్‌ మోడల్‌గా సక్సెస్ సాధించిన నందిని అగసర గెస్ట్‌లుగా హాజరయ్యారు.

Asian Games 2023 medalist Nandini Agasara refutes Swapna Burman's  'transgender' allegations, to take up issue with AFI - BusinessToday

ఇక శివాజీ, కుమారి ఆంటీ కామెడీ తో ప్రేక్షకులను నవ్వించేందుకు ప్రయత్నించారు. ఇమ్మానుయేల్, వర్ష మధ్యన సాగే కామెడీ సన్నివేశాలు ప్రేక్షకుల్లో నవ్వులు పూయించాయి. వీరిద్ద‌రి మధ్య సంబంధం ఉందంటూ మంగళవారం కాన్సెప్ట్ లాగా గోడపై రాసి ఉంచారు. ఈ సన్నివేశాలు హైపర్ ఆది, వర్ష, ఇమ్మానుయేల్ కామెడీతో మెప్పించారు. ఈ నేపథ్యంలో కుమారి ఆంటీ బాగున్నారా నాన్న అంటూ అందరిని పలకరించి.. వారందరికీ ప్రేమ‌గా భోజనాన్ని వడ్డించింది. దీని తర్వాత ఏషియన్ గేమ్స్ బ్రాంజ్‌ మోడల్ విన్నర్ మన తెలుగు అమ్మాయి అయినా నందిని ఆగసరని రష్మీ స్టేజ్ పైకి ఆహ్వానించింది. ఆమె వచ్చి మాట్లాడుతూ తన కుటుంబా ఆర్థిక పరిస్థితి గురించి ఎమోషనల్ అయింది.

ఓ టైంలో గాయం కావడంతో దానికి చికిత్స కోసం డబ్బు మొత్తం ఖర్చయిపోయిందని.. తినడానికి తిండి కూడా లేక ఇబ్బంది పడుతున్నట్లు నందిని వివరిస్తూ.. కన్నీళ్లు పెట్టుకుంది. తన టాలెంట్ తో మెడల్స్ ఎన్నో వస్తాయి.. కానీ ఆమెకు కడుపునిండా తిండి లేదు అంటూ హైపర్ ఆది ఆమె పరిస్థితిని అందరికీ వివరించాడు. అయితే ఇప్పటికే హైపర్ ఆది ఎన్నో సేవా కార్యక్రమాలతో ప‌లువురి ప్రశంసలు అందుకుంటున్నాడు. అదేవిధంగా మరోసారి తన మంచితనాన్ని చాటాడు. ఈ ఎపిసోడ్ కి నాకు వచ్చే పేమెంట్ మొత్తాన్ని నందిని కోసం ఇచ్చేస్తున్నా అంటూ అనౌన్స్ చేశాడు. అలాగే ఈ షోలో పాల్గొన్న ప‌లువురు కామెడియ‌న్స్ నందినీకి సహాయం చేస్తామంటూ హామీ ఇచ్చారు.