మిస్ వరల్డ్ మమ్మీ తో మోస్ట్ బ్యూటిఫుల్ డాటర్.. చూడడానికి రెండు కళ్ళు చాలట్లేదుగా..

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీకి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. భార్య నమ్ర‌త ఒకప్పటి హీరోయిన్గా, మిస్ వరల్డ్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈమె తెలుగులో కూడా పలు సినిమాల్లో నటించింది. అలాగే మహేష్ కూతురు సితార ఇటీవల ఓ ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ కు అంబాసిడర్ గా వ్యవహరించి భారీ పాపులారిటీ దక్కించుకుంది. ఇక కొడుకు గౌతమ్ విదేశాల్లో చదువుతూ అప్పుడప్పుడు తండ్రి లాగా సేవా కార్యక్రమాలు చేస్తు నెట్టింట‌ వైరల్ అవుతూ ఉంటాడు.

ఇక సితార ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్ లో సీతారా మిలియన్ మంది ఫాలోవర్లను దక్కించుకుంది. తరచుగా డ్యాన్స్ వీడియోలు ఫోటోషూట్స్ వెకేషన్ ఫోటోలను షేర్ చేసుకుంటూ ఫ్యాన్స్ ని దిల్ ఖుష్ చేస్తుంది. లుక్కుతో మెరిసిపోతూ ఉంటుంది. ఒకప్పటి మిస్ వరల్డ్ అయిన ఈ ముద్దుగుమ్మ ఇటీవల మోస్ట్ బ్యూటిఫుల్ కూతురు సితార తో కలిసి ఓ ఫోటోషూట్ లో సందడి చేసింది.

అది ఓ ప్రమోషనల్ షూట్ అని తెలుస్తుంది. పట్టుబట్టల్లో సాంప్రదాయంగా కనిపించిన ఈ తల్లి కూతుళ్లు.. ఒకరిని మించి మరొకరు అందంగా కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవ్వడంతో అంత ఇద్దరు తల్లి కూతుళ్ళ‌ను ఒకే ఫ్రేమ్‌లో చూడడానికి రెండు కళ్ళు సరిపోవడం లేదు అంటూ కామెంట్లు చేస్తున్నారు.