ఇటీవల పూనమ్ పాండే తాను చనిపోయానని చెప్పి అందరిని బ్లఫ్ చేసిన సంగతి తెలిసిందే. పూనమ్ పాండే సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక్క పోస్ట్ ఓవర్ నైట్ లో సోషల్ మీడియా హాట్ టాపిక్ గా మారిపోయింది. ఈ పోస్ట్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. గర్భాశయ క్యాన్సర్ తో ఆమె చనిపోయిందంటూ తన సోషల్ మీడియా వేదికగా ట్విట్ చేశారు. దీంతో అందరూ ఆశ్చర్యపోయారు. పూనమ్ పాండే మృతి పట్ల పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముంబైలోనే చనిపోయిందని కూడా తన సోషల్ మీడియా వేదికగా వివరించింది. ఆ తర్వాత 24 గంటలకు సోషల్ మీడియాలో స్వయంగా తానే ప్రత్యక్షమై ఓ వీడియోను పోస్ట్ చేసింది.
అందులో ఆమె మాట్లాడుతూ నేను బ్రతికే ఉన్న.. కేవలం గర్భసయ కాన్సర్ పై ప్రజల్లో అవగాహన కల్పించడం కోసమే ఇలాంటి పోస్ట్ చేసాం అంటూ వివరించింది. ఇది మాత్రమే కాదు క్యాన్సర్ పై అవగాహన కల్పించేందుకు కొన్ని విషయాలను కూడా ఈమె షేర్ చేసుకుంది. చివరిగా ఈ వీడియోలో క్షమాపణలు కోరుకున్న పూనమ్ పాండే తర్వాత పలువురి విమర్శకులు విమర్శలకు, ట్రోల్స్ కు గురైంది. ఇక ఈ సంఘటన తర్వాత పూనమ్ పాండేకు పెద్ద షాక్ ఎదురైంది. ఈమె పై కేసు నమోదు చేశారు. దీంతో పాటు మరోసారి పూనమ్‌కు పెద్ద షాక్ ఎదురైంది అని చెప్పవచ్చు.
అమెరికా ఫార్మన్యూటికల్ కంపెనీ మార్క్ చెందిన భారతీయ అనుబంధ సంస్థ ఎం ఎస్ టి నుంచి పెద్ద దెబ్బ తగిలింది. ఈ పబ్లిసిటీ స్టంట్ కారణంగా ఆమెకు పెద్ద కాంట్రాక్ట్ క్యాన్సిల్ అయిందని టాక్. ఏజెన్సీ క్రియేటివ్ మార్కెటింగ్ సొల్యూషన్ తో ఆమె ఒప్పందం కుదుర్చుకోగా.. ఇప్పుడు అది క్యాన్సిల్ అయినట్లు తెలుస్తుంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే పూనమ్ పాండే చేసిన పబ్లిసిటీస్టంట్‌లో ఈ ఏజెన్సీ పాల్గొంది. కాంట్రాక్ట్ క్యాన్సిల్ కావడంతో పోనమ్‌కు భారీగా నష్టం కలిగిందని హిందీ మీడియా లో టాక్ వినిపిస్తుంది.