చూడడానికి సైలెంట్ గా కనిపించే సందీప్ కిషన్.. ఏకంగా అంత మంది హీరోయిన్స్ తో ఎఫైర్ నడిపాడా.. గురుడు మంచి రొమాంటికే..

యంగ్‌ హీరో సందీప్ కిషన్ ఇటీవల ఓ మంచి హిట్ కొట్టి ఎలాగైనా సక్సెస్ సాధించాలని తాపత్రయంతో తెగ ట్రై చేస్తున్నాడు. ప్రస్తుతం ‘ ఊరు పేరు భైరవకోన ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైన ఈ యంగ్ హీరో.. గతేడాది మైకల్ సినిమాతో వచ్చినప్పటికీ ఊహించిన రెంజ్‌లో సక్సెస్ సాధించలేకపోయాడు. దీంతో ఈ సినిమాతో ఎలాగైనా బ్లాక్ బస్టర్ కొట్టాలని కసితో ఉన్నాడు. ఇక హారర్ మూవీల‌కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న విఐ ఆనంద్ డైరెక్షన్లో ఈ సినిమా తూపొందింది. ఈ సినిమాలో వర్ష బొల్లమా, కావ్య థ‌ఫర్ హీరోయిన్‌లుగా నటించారు. ఇక ఫిబ్రవరి 16న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా నుంచి టీజర్, ట్రైలర్, సాంగ్స్ రిలీజై ప్రేక్షకులను భారీ రేంజ్ లో ఆకట్టుకున్నాయి. ఇప్పటికే సినిమాపై మంచి హైప్‌ నెలకొంది.

Sundeep Kishan's 'Ooru Peru Bhairavakona' comes with a new release date

ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ వేగవంతంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సందీప్ కిషన్ తన పర్సనల్ లైఫ్ కు సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నాడు. చూడడానికి సైలెంట్ గా ఉండే ఈ యంగ్ హీరో ఏకంగా ఇప్పటివరకు ముగ్గురితో లవ్ ఎఫైర్‌ నడిపాడని.. వారి ముగ్గురితో బ్రేకప్ అయిపోయిందని చెప్పుకొచ్చాడు. అయితే వారి ఎవరి పేర్లు బయటకి రానీయకుండా చాలా సీక్రెట్ గా మెయింటెన్ చేశానని.. వారందరినీ సీరియస్ గా లవ్ చేశానంటూ చెప్పిన యంగ్ హీరో.. ఒకరిని 4 ఏళ్ళు, ఒకరిని రెండేళ్లు, ఒకరిని రెండున్నరేళ్ళు ఇలా ప్రతి ఒక్కరిని సిన్సియర్గా లవ్ చేశా.. కానీ వర్కౌట్ కాలేదు అంటూ వివరించాడు. అయితే వీరిలో ఒకరు రెజీనా అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

Sundeep Kishan Ooru Peru Bhairava kona is alive?

రెజీనాకు నాకు మధ్య అలాంటి సంబంధం లేదు. తను నా కాలేజ్ నుంచి మంచి ఫ్రెండ్. నా కష్టాలు, నష్టాలు, లవ్, బ్రేకప్స్ అన్నీ తను దగ్గర నుంచి చూసింది. ఇప్పటికీ నాకు తను మంచి సపోర్ట్ గా ఉంటుంది అంటూ వివరించాడు. ప్రస్తుతం సందీప్ కిషన్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. దీంతో ఒకరు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురితో ఎఫైర్ నడిపావా ఇప్పటివరకు దానిని సీక్రెట్ గా ఉంచావు చూడు నువ్వు రియలీ గ్రేట్ బాసు అంటూ.. అయితే ఇప్పటివరకు ఏకంగా ముగ్గురు హీరోయిన్స్ తో రొమాన్స్ చేశాడా.. గురుడు మంచి రొమాంటికే అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.