ఆ సింపుల్ లాజిక్ ని మిస్ అయిన యాత్ర 2 డైరెక్టర్.. అడ్డంగా బుక్ అయిపోయాడు గా…!

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా 2019లో తెరకెక్కిన యాత్ర మూవీకి ఇటీవలే సీక్వెల్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. యాత్ర 2 లో వైయస్ రాజశేఖర్ రెడ్డి 2009 ఎన్నికల్లో విజయం సాధించడం నుంచి 2019 ఎన్నికలలో సీఎంగా జగన్ విజయం సాధించే వరకు ప్రతి ఒక్క ఘటన ఎంతో అద్భుతంగా చూపించాడు వి. రాఘవ్. కానీ ఈ సినిమాలో కొన్ని లాజిక్స్ ని మిస్ అయ్యాడు డైరెక్టర్.

అవేంటంటే.. జగన్ కి ప్రతికూలమైన చంద్రబాబు నాయుడు మరియు సోనియా గాంధీ లాంటి వాళ్లను విలన్స్ ను చూపించడంలో దర్శకుడు ఏమాత్రం మొహమాట పడలేదు. అదే సమయంలో జగన్ కి ఇబ్బంది కలిగించే వ్యక్తుల పాత్రలను ఈ సినిమాలో లేకుండా చూసుకున్నారు. ముఖ్యంగా చెప్పాల్సింది జగనన్న వదిలిన బాణాన్ని అటు జగన్ జైలులో ఉండగా కష్టపడి పాదయాత్ర చేసిన వైయస్ షర్మిలను.. డైరెక్టర్ ఈ సినిమాలో అస్సలు చూపించలేదు. అదేవిధంగా తన తల్లి జైలుకి వెళ్లినప్పుడు విజయమ్మ మరియు భార్య ఎమోషన్స్ ని చూపించలేదు.

ఇక మరో పక్క పవన్ కళ్యాణ్ మరియు వైయస్ వివేకానంద రెడ్డి పాత్రలు కూడా కనిపించలేదు. కానీ ఒకచోట మాత్రం చంద్రబాబు పాత్రలో ఒక వైపు బీజేపీని జాతీయ పార్టీ.. మరో వైపు జనసేన ను తలా తోక లేని పార్టీ అంటూ పరోక్షంగా వినిపించింది. కేవలం ఈ సినిమాలో జగన్ ని హీరో చేసేందుకే ఇదంతా ప్రయత్నించినట్లు తెలుస్తుంది. ఏదేమైనా జగన్ జీవిత కథ రాసినప్పుడు తన తల్లి ఎమోషన్స్ మరియు చెల్లి కష్టాన్ని చూపించకపోవడం ఎలా మిస్ అయ్యారో మనకి అర్థం కావడం లేదు. ఎంతో ఇష్టంతో షర్మిల తన అన్న కోసం ఏకంగా అంత చేస్తే జగన్ కి సిస్టర్ ఉన్నట్లు కూడా చూపించలేదు సినిమాలో… ఇక ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.