ఓ మై గాడ్: సాయి పల్లవి ఇప్పటివరకు ఎన్ని సినిమాలను రిజెక్ట్ చేసిందో తెలుసా.. వాటి రిజల్ట్ ఏంటంటే..?!

సౌత్ స్టార్ హీరోయిన్‌ల‌లో సాయి పల్లవి ఒక‌టి. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ సాధారణంగా వైద్యురాలు. నటన అంటే ఇష్టంతో వైద్యరంగం నుంచి సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ పెళ్లిని కూడా వాయిదా వేసి మరి నటనతో తన జీవితాన్ని కొనసాగిస్తుంది. కాగా ఇటీవల తన చెల్లెలు పెళ్లి చేయడానికి సిద్ధమైన ఈ ముద్దుగుమ్మ.. మొదట మలయాళం ప్రేమమ్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాతో భారీ బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకుంది. ఇక సాయి పల్లవి నేచురల్ బ్యూటీ కి ప్రాధాన్యతనిస్తూ.. నటించే అన్ని పాత్రలలో డి గ్లామరస్ గా కనిపిస్తుంది. ఆమె నటించే పాత్రలన్నీ సహజంగా ఉండడంతో పక్కింటి అమ్మాయి ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.

Depressing Story Behind Sai Pallavi's Successful Dance Songs

పాత్రల ఎంపికలు ఆచితూచి అడుగు వేసే ఈ ముద్దుగుమ్మ తన పాత్రకు ఇంపార్టెన్స్ లేదనిపిస్తే అది ఎంత పెద్ద సినిమా అయినా రిజెక్ట్ చేస్తుంది. అలా ఈమె రిజెక్ట్ చేసిన సినిమాలు అన్నీ దాదాపు డిజాస్టర్ గా నిలిచాయి. ముఖ్యంగా ఇటీవల చిరంజీవితో భోళాశంకర్ సినిమాలో నటించే అవకాశం వచ్చిన దాన్ని సాయి పల్లవి రిజెక్ట్ చేసేసింది. తీరా ఆ మూవీ రిలీజ్ అయిన తర్వాత బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో డిజాస్టర్ అందుకుందో తెలిసిందే. అంతకుముందు డియర్ కామ్రేడ్ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన నటించే ఛాన్స్ సాయి పల్లకి వచ్చిన దీనిని కూడా రిజెక్ట్ చేసిందని తెలుస్తుంది. ఈ మూవీలో ముద్దు సన్నివేశాలు ఎక్కువగా ఉండడంతో దానిని తోసిబుచ్చారు సాయి పల్లవి. ఆ తర్వాత ఈ రోల్ లో రష్మిక నటించింది. ఈ సినిమా ఊహించిన రేంజ్ లో సక్సెస్ అందుకోలేదు.

The next schedule of 'SK 21' starring Sivakarthikeyan and Sai Pallavi  begins in Chennai | Tamil Movie News - Times of India

తమిళ్లో అజిత్ సరసన వలిమై సినిమాలో నటించే అవకాశం వచ్చిన తనకు ఆ పాత్ర నచ్చకపోవడంతో వదిలేసిందట. ఇటీవల విజయ దళపతి హీరోగా వచ్చిన లియో సినిమాలోను నాయకీగా సాయి పల్లవికి ఛాన్స్ వచ్చిందని.. అందులో పాత్రకు ఇంపార్టెన్స్ లేకపోవడంతో దానిని వదిలేసినట్లు తెలుస్తుంది. అలాగే చంద్రముఖి 2 లో కాంట్ర‌వర్షియల్ బ్యూటీ కంగనా రనౌత్ హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే. మొదట ఈ సినిమాలో సాయి పల్లవికి ఛాన్స్ వస్తే కథ నచ్చలేదని చెప్పేసిందట. ఈ సినిమా కూడా ప్లాప్ అయింది. అలా సాయి పల్లవి రిజెక్ట్ చేసిన సినిమాలు అన్ని దాదాపు నిరాశపరిచాయి. దీంతో సాయి పల్లవి ఏదైనా సినిమాను రిజెక్ట్ చేస్తే అది కచ్చితంగా ఫ్లాప్ అవుతుందని టాక్ మీడియాలో మొదలైపోయింది. కాగ‌ ప్రస్తుతం సాయి పల్లవి.. కమల్ హాసన్ ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్న శివ కార్తికేయన్ మూవీలో హీరోయిన్గా నటిస్తుంది.