బిగ్ బ్రేకింగ్:”మా విడాకులకు కారణం అదే”.. అసలు నిజాని బయటపెట్టి షాకిచ్చిన ఐశ్వర్య రజనీకాంత్..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు సంపాదించుకోవడానికి ట్రై చేస్తున్న ఐశ్వర్య రజనీకాంత్ ఇన్నాళ్లకు తాను ఎందుకు విడాకులు తీసుకున్నాను అన్న విషయాన్ని బయట పెట్టింది . ప్రజెంట్ ఇదే న్యూస్ కోలీవుడ్ మీడియాలో షాకింగ్ గా ట్రెండ్ అవుతుంది . కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ – రజనీకాంత్ పెద్దకూతురు ఐశ్వర్య పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీళ్ళకి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. చాలా చక్కగా అన్యోన్యంగా సాగిపోతున్న వీళ్ళ సంసారంలో కలతలు మొదలయ్యాయి .

వాళ్ళమధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా 17 ఏళ్ల వైవాహిక బంధానికి బ్రేకప్ చెప్పేసుకుంటూ డివర్స్ తీసుకున్నారు . వీళ్ళు విడాకులు తీసుకున్నప్పుడు ఎంత మంది ఫ్యాన్స్ బాధపడ్డారో మనకు తెలిసిందే. అసలు వాళ్ళు ఎందుకు విడాకులు తీసుకున్నారు అనేది ఇప్పటికి ప్రశ్నార్థకంగానే ఉండిపోయింది . రీసెంట్గా ఆమె తెరకెక్కించిన సినిమా లాల్ సలాం. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు .ఈ ఇంటర్వ్యూలో తన విడాకులపై సంచలన కామెంట్స్ చేసింది ఐశ్వర్య ,

“గత రెండేళ్లుగా నేను ఒంటరిగానే ఉన్నాను.. ఒంటరితనంతోనే ఫ్రెండ్షిప్ చేస్తున్నాను .. ఈ ప్రయాణంలో నేను గమనించింది ఒకటే.. వంటరిగా ఉన్నప్పుడే మనం మరింత సురక్షితంగా ఉండగలం .. ఏకాంతం నాకు బాగా నచ్చింది .. ఒకప్పుడు పిల్లల కోసం బ్రేక్ తీసుకున్నాను .. కానీ ప్రపంచం చాలా వేగంగా ముందుకు వెళ్లి పోతుంది .. టైం అసలు తెలియడం లేదు .. పిల్లలు ఎదిగే టైంలో వారితోనే ఉండాలి అని అనుకుంటున్నాను . జీవితం ఇలా ఒంటరిగా లాక్కొరవడమే నాకు ఆనందకరంగా ఉంది “అంటూ చెప్పుకొచ్చింది . పరోక్షకంగా ఐశ్వర్య రజినీకాంత్ ధనుష్ తో విడాకులు తీసుకొని నేను హ్యాపీగానే ఉన్నాను అంటూ కామెంట్స్ చేయడంతో ఇప్పుడు కోలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి..!