వెంకటేష్ తో సినిమా చేయాలి అంటే డైరెక్టర్స్ కి ఆ ఒక్కటి ఉంటే చాలు.. చంకలు గుద్దుకుని ఆఫర్ ఇచ్చేస్తాడా..?

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా ఫ్యామిలీ హీరో అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు విక్టరీ వెంకటేష్ . డాక్టర్ డి.రామానాయుడు గారి కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వెంకటేష్ తనదైన స్టైల్ లో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించారు . అంతేకాదు తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు . అప్పటివరకు తొడలు కొడుతూ .. మీసాలు మెలేస్తూ ఉన్న హీరోలే చూసాం. అప్పుడప్పుడే ఫ్యామిలీ ఆడియన్స్ ని లేడీస్ ని కూడా ఇండస్ట్రీలో థియేటర్స్ కి రప్పించిన ఘనత అందుకున్నాడు వెంకటేష్ .

ఈ మధ్యకాలంలో వెంకటేష్ సరైన హిట్ కొట్టలేదు. రీసెంట్గా నటించిన సైంధవ్ కూడా డిజాస్టర్ గా మారింది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఆయనకు సంబంధించిన విషయాన్ని ట్రెండ్ చేస్తున్నారు జనాలు. వెంకటేష్ హిట్ ట్రాక్ ఉన్న డైరెక్టర్స్ ని చూజ్ చేసుకోరు అని.. ఆయనకు సెన్సార్ హ్యూమర్ అంటే ఇష్టమని.. అలా సెన్సార్ హ్యూమర్ ఉంటే చాలు అది ఎంత పెద్ద డైరెక్టర్ అయినా.. ఎంత చెత్త డైరెక్టర్ అయినా అవకాశం ఇచ్చేస్తారు అని …దారుణంగా ట్రోల్ చేస్తున్నారు .

అంతేకాదు వెంకటేష్ ఆ పద్ధతి మానుకోకపోతే ఫ్యూచర్లో చాలా చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాలి అని కూడా చెప్పుకొస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ గా మారింది. మరి కొందరు దారుణాతి దారుణంగా వెంకటేష్ ని ట్రోల్ చేస్తూ ఉండడం గమనార్హం. ఏ మాటకు ఆ మాటే సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగే విషయం నిజంగా వాస్తవమే.. వెంకటేష్ అలాంటి డైరెక్టర్లకే ఛాన్స్ ఇస్తాడు అంటున్నారు జనాలు..!!