ఆ ఒకే ఒక్క తప్పు చెయ్యకపోతే స్వీటీ ఈపాటికి ఎక్కడో ఉండేదా.. పాపం..!

స్టార్ హీరోయిన్స్ లో ఒకరైన అనుష్కశెట్టి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ తన అందం అభినయంతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకుంది. అదేవిధంగా ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా కొనసాగిన ఈమె ప్రస్తుతం సినిమాలు లేక ఇండస్ట్రీకి దూరమైంది. అయినప్పటికీ అప్పుడప్పుడు కనిపిస్తూ తన ఫాన్స్ కి ట్రీట్ ఇస్తుంది.

ఇక తాజాగా అనుష్క పై ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అనుష్క ఆ ఒక్క తప్పు చేయడం మూలంగానే ఇండస్ట్రీకి దూరమైంది అంటూ ఓ వార్త వినిపిస్తుంది. సైజ్ జీరో సినిమా కోసం భారీగా లావునా అనుష్క ని చూసిన ప్రతి డైరెక్టర్ కూడా ఆమెని సినిమాలో పెట్టుకోవడానికి ఒప్పుకోలేదు.

ఇక ఒక సినిమా కోసం దాదాపు కెరీర్ ని నాశనం చేసుకుందని అప్పట్లో సైజ్ జీరో సినిమా అనుష్క చేయకపోయి ఉంటే ప్రస్తుత కాలంలో కూడా ఆమెకి మంచి అవకాశాలు దక్కేవి. కానీ ఆమె ఆ సినిమా చేయడం ద్వారా ఆమె కెరీరే స్పాయిల్ అయింది. ఆ ఒక్క తప్పు చేసి ఉండకపోతే అనుష్క కెరీర్ నేడు ఓ రేంజ్ లో ఉండేది. అయినప్పటికీ అనుష్క డెడికేషన్ కి హ్యాట్సాఫ్ చెప్పొచ్చు. ఆ సినిమా వల్లే తనకి సినిమా అవకాశాలు రాకపోయినా ఆ సినిమా తెరకెక్కించిన డైరెక్టర్ పై ఏమాత్రం అసూయ పెంచుకోలేదు అనుష్క.