వావ్ : ‘ వార్ 2 ‘ లో తారక్ సరసన ఆ స్టార్ హీరోయిన్.. అసలు గెస్ చేయలేరు..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల డైరెక్షన్లో దేవర సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ కధానాయక జాన్వి కపూర్ ఎన్టీఆర్ జంటగా నటిస్తోంది. కాగా ఎన్టీఆర్ నటిస్తున్న మరో సినిమా వార్ 2 లో తారక్‌ సరసన ఆలియా భట్ నటిస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. హృతిక్ తో కలిసి వార్‌2 లో ఎన్టీఆర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో పార్ట్ 2లో ఆలియా హీరోయిన్ గా నటిస్తోందంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే హృతిక్ స‌ర‌సన.. లేదా ఎన్టీఆర్ సరసన.. అనేదాన్నిపై క్లారిటీ రాలేదు. ఇక ఆలియా లాంటి టాలెంటెర్ స్టార్ట్ బ్యూటీ ఎన్టీఆర్ కి హీరోయిన్గా నటిస్తే చాలా బాగుంటుంది అంటూ అభిమానులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఇక గతంలో ఆర్‌ఆర్ఆర్ సినిమాలో చరణ్ స‌రస‌న నటించిన ఆలియా ఈ సినిమా సెట్స్ లో ఎన్టీఆర్ తోను ఎంతో ఫ్రెండ్లీగా ఉంటూ మంచి ఫ్రెండ్ గా మారిపోయిందిస‌ చరణ్, తారక్ టాలెంట్ కు ఆశ్చర్యపోయాను అంటూ ఆలియా కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లోనే ఎన్టీఆర్ నటించే నెక్స్ట్ సినిమా దేవర కోసం ఆలియాను ఒప్పించే పనిలో మేకర్స్ ఉన్నారని వార్తలు వినిపించాయి. అయితే అది సక్సెస్ కాలేదు. దీంతో జాన్వి కపూర్‌ని హీరోయిన్‌గా తీసుకున్నారు కొరటాల. ఇప్పుడు వార్ 2 కోసం ఎన్టీఆర్ స‌ర‌సన ఆలియా నటించబోతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి ఇప్పటివరకు అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు.

IndiaContent

అయితే ఈ నెలాఖరి నుంచి వార్‌2 సెట్స్‌ పైకి రానుంది. ఈ క్ర‌మంలో అయాన్ ముఖర్జీ హీరోయిన్లను ఫైనలైజ్ చేసే పనిలో బిజీగా ఉన్నాడట. ఇక ఇప్పటికే అలియాభట్ ద బెస్ట్ స్టార్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డును అందుకుంది. ఇటీవల కృతిసనన్‌తో కలిసి అవార్డును పంచుకున్న ఈ ముద్దుగుమ్మ చిన్న వయసులోనే తన నటనతో సత్తా చాటుకుంది. అలాగే హాలీవుడ్ సినిమాల్లోనూ నటించి ఆలియా ప్రపంచవ్యాప్తంగా భారీ క్రేజ్‌తో దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ఇప్పటికే పాన్ ఇండియా స్టార్లు కావ‌డంతో అందులో ఆలియా కూడా కలిసిందంట సినిమాకు మరింత బలం చేకూరుతుందని.. దీంతో వార్ 2లో ఆలియాను తీసుకోవడం చాలా వరకు ఖాయం అని.. అది కూడా ఎన్టీఆర్ సరస‌న‌ ఆలియా నటిస్తోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై మేకర్స్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.