వారెవా.. ఏ పాత్రనైనా అలవోకగా నటించే బాలయ్య.. ఒక్క పోలీస్ గెటప్ లోనే ఇన్ని సినిమాల్లో నటించాడా.. ?

నందమూరి నట‌సింహం బాలకృష్ణ.. టాలీవుడ్‌ ఇండస్ట్రీలో అడుగుపెట్టి 50 ఏళ్లు అవుతున్న ఇప్పటికీ అదే క్రేజ్‌తో దూసుకుపోతున్నాడు. యంగ్ హీరోలకు దీటుగా గట్టి పోటీ ఇస్తూ హ్యాట్రిక్ హిట్లను తన ఖాతాలో వేసుకున్న బాలయ్య.. చివ‌రిగా న‌టించిన‌ భగవంత్ కేసరి తో బ్లాక్ బస్టర్ అందుకొని మరింత ఫామ్ లోకి వచ్చాడు. ప్రస్తుతం యంగ్ డైరెక్ట‌ర్‌ బాబీ డైరెక్షన్లో బాలయ్య తన 109వ సినిమాలో నటిస్తున్నాడు. ఇక బాలయ్య వరుస హ్య‌ట్రిక్‌ సినిమాలతో హిట్‌ కొట్టడం.. అలాగే బాబీ చివరి సినిమా వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడంతో.. వీరిద్దరి కాంబోలో రాబోతున్న 109వ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

ఇక ఎటువంటి పాత్రలోనైనా అలవోకగా నటించి మెప్పించే బాలయ్య తన చిన్నతనం నుంచే నటన రంగంలోకి అడుగుపెట్టి ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. అయితే బాలయ్య తన సినీ కెరియర్ లో ఇప్పటివరకు ఏకంగా 7 సినిమాలలో పోలీస్ ఆఫీసర్ గా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. బాలయ్య పోలీస్ ఆఫీసర్గా నటించిన మొదటి మూవీ ఇన్స్పెక్టర్ ప్రతాప్.

ఈ సినిమాలో బాలయ్య సరస‌న విజయశాంతి నటించింది. ఈ సినిమా ఆపట్లో మంచి సక్సెస్ అందుకుంది. ఈ సినిమా తర్వాత తిరగబడ్డ తెలుగు బిడ్డ సినిమాలో పొలీస్‌గా క‌నిపించాడు. ఈ సినిమాలో భానుప్రియ బాలయ్యకు జంటగా మెప్పించింది. దీని త‌ర్వాత పొలీస్ గెట‌ప్‌లో న‌టించిన రౌడీ ఇన్స్పెక్టర్‌లోను బాలయ్య సరస‌న విజయశాంతి నటించింది, అలాగ్ లక్ష్మీనరసింహ, అల్లరి పిడుగు, చెన్నకేశవరెడ్డి, భగవంత్‌ కేసరి తదితర సినిమాల్లో బాలకృష్ణ ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా మెప్పించాడు.