గుంటూరు కారంలో రష్మీ మిస్ చేసుకున్న రోల్ ఏంటో తెలుసా..? త్రివిక్రమ్ థింకింగ్ నే వేరబ్బా..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో యాంకర్ గా పాపులారిటీ సంపాదించుకున్న రష్మీ గౌతం గుంటూరు కారం సినిమాలో ఓ రోల్ రిజెక్ట్ చేసిందంటే.. అవునన్నా సమాధానమే వినిపిస్తుంది . గుంటూరు కారం సినిమమాలో మహేష్ బాబు హీరోగా నటించాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీల – మీనాక్షి చౌదరి నటించారు . అంతేకాదు ఈ సినిమా టాక్ ప్రకారం నెగిటివ్గా మూట కట్టుకున్న కలెక్షన్స్ పరంగా మాత్రం పాజిటివ్గా కుమ్మి పడేసింది . సోషల్ మీడియాలో ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి ట్రోలింగ్ జరిగిందో కూడా మనం చూసాం .

తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక న్యూస్ బయటపడింది . ఈ సినిమాలో కుర్చీ మడత పెట్టి సాంగ్ లో ముందుగా పూర్ణా కంటే రష్మిని చూస్ చేసుకున్నాడట త్రివిక్రమ్ . అయితే రష్మీ పాత్రను సున్నితంగా రిజెక్ట్ చేసిందట . పెద్దగా చెప్పుకోదగ్గ క్యారెక్టర్ కాకపోవడం పైగా మహేష్ బాబు లాంటి స్టార్ హీరో సినిమాలో ఐటమ్ సాంగ్ చేస్తే ఇంకా కెరియర్ డౌన్ అయిపోతుంది అన్న భయంతో రష్మీ ఆఫర్ ను రిజెక్ట్ చేసిందట .

అయితే ఏమాత్రం బాధపడని త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు పూర్ణాన్ని చూస్ చేసుకున్నాడట. అంతేకాదు పూర్ణ ఈ పాత్రలో నటించి మెప్పించింది . పూర్ణ కు ఈ సాంగ్ మంచి కిక్కిచ్చింది. ఇలాంటి ఐడియాలు త్రివిక్రమ్ కి ఎలా వస్తాయి అంటూ చర్చించుకుంటున్నారు ఆయన అభిమానులు. కాగా ప్రెసెంట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు నాని – వెంకటేష్ కాంబోలో మల్టీ స్టార్ సినిమాను తెరకెక్కించడానికి ప్రయత్నాలు చేస్తున్నారట . మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమాకి కమిట్ అయ్యాడు. దీనికోసం బాగా కష్టపడుతున్నారు. రష్మీ యాంకర్ గా తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో దూసుకుపోతుంది..!!