పైసా ఖర్చు లేకుండా పెరట్లో ఉండే మందారం తో సిల్కీ హెయిర్ మీ సొంతం…!!

సాధారణంగా చాలామంది అమ్మాయిలు సిల్కీ హెయిర్ ను బాగా ఇష్టపడుతుంటారు. సిల్కీ హెయిర్ చూడడానికి ఆకర్షణగా ఉంటుంది. అందాన్ని రెట్టింపు చేస్తుంది. అందుకే సిల్కీ హెయిర్ ను పొందడం కోసం కెరటిన్ ట్రీట్మెంట్ చేయించుకుంటారు. ఇందుకోసం వేలకు వేలు ఖర్చు పెడతారు. కానీ పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే కేవలం నాలుగు మందార ఆకుల తో సిల్కీ హెయిర్ ను పొందొచ్చు. అవును మీరు విన్నది నిజమే.

మరి ఇంతకీ మందారం ఆకులను ఎలా ఉపయోగించాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా నాలుగు మందారం ఆకులను తీసుకుని చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే రెండు మందారం పువ్వులను కూడా తీసుకుని తుంచి పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో రెండు గ్లాసుల వాటర్ పోసుకోవాలి. వాటర్ ‌ హిట్ అవ్వగానే అందులో మందారం పువ్వులు ఆకులు వేసి పది నిమిషాల పాటు మరిగించాలి.

ఆపై స్టవ్ ఆఫ్ చేసి మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి. ఈ వాటర్ గోరువెచ్చగా అయిన తర్వాత అందులో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల రెగ్యులర్ షాంపును వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ వాటర్ ను ఉపయోగించి తలస్నానం చేయాలి. వారానికి రెండు సార్లు ఈ విధంగా హెయిర్ వాష్ చేసుకుంటే చాలు సిల్కీ హెయిర్ మీ సొంతం.