భగవంత్‌ కేసరి ఓటిటి ప్లాట్‌ఫామ్ అదే.. రిలీజ్ ఎన్ని రోజుల కంటే..?

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో బాలకృష్ణ వయసుతో సంబంధం లేకుండా వరుస‌ సినిమాల్లో నటిస్తూ బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాల‌ను తన ఖాతాలో వేసుకుంటున్నారు. అయితే నందమూరి నట‌సింహ బాలకృష్ణ అఖండ, వీర సింహారెడ్డి లాంటి బ్లాక్ బ‌స్టర్ హిట్ల తర్వాత తన ఖాతాలో హ్యాట్రిక్ హీట్ ను వేసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాడు. ఇక ఈ రోజు భగవంత్ కేసరి సినిమా ప్రేక్ష‌కుల‌ముందుకు వ‌చ్చింది.

ఈ మూవీ ప్రీమియర్ షో తోనే పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. సినిమా చాలా బాగుందని.. రెస్పాన్స్ థియేటర్లో వినిపించింది. నందమూరి అభిమానుల థియేటర్స్ వద్ద సంబరాలు చేస్తున్నారు. ఓపెనింగ్స్ అయితే గట్టిగా రావ‌టంలో సందేభం లేదు. ఇదిలా ఉంటే ఈ సినిమా ఓటిటి రైట్స్ స్ట్రీమింగ్ హక్కులకు ఓటిటి వేదికలపై గట్టి పోటీ ఏర్పడింది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ భగవంత్‌ కేసరి డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకుంది.

ఇక తాజాగా రిలీజ్ అయిన ఈ సినిమా ఓటిటి పార్ట్నర్ డీటెయిల్స్ ను టైటిల్ కార్డు లో చూపించారు మూవీ టీమ్‌. ఈ సినిమాకి రిలీజ్ అయిన 50 రోజులు తరువాతే ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా నిర్మాతలు అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా అక్టోబర్ 19 విడుదల కావడంతో డిసెంబర్ నెలాఖరిలో దాదాపు స్ట్రీమింగ్‌కి వచ్చేస్తుందట‌.