బాల‌య్య‌కు మందుతో అభిషేకం చేసిన ఫ్యాన్స్‌.. ఇదేం అభిమానం రా బాబు!(వీడియో)

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ నేడు `భ‌గ‌వంత్ కేస‌రి` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్ గా న‌టిస్తే.. శ్రీ‌లీల కీల‌క పాత్ర‌ను పోషించింది. బాలీవుడ్ న‌టుడు అర్జున్ రాంపాల్ విల‌న్ గా యాక్ట్ చేశాడు. భారీ అంచ‌నాల నడుమ నేడు అట్ట‌హాసంగా విడుద‌లైన భ‌గ‌వంత్ కేస‌రి పాజిటివ్ రివ్యూల‌ను సొంతం చేసుకుంటోంది.

పక్కా ఫ్యామిలీ ఎమోషనల్ అండ్ ఎంటర్టైనర్ మూవీ అంటూ కొనియాడుతున్నారు. సెంటిమెంట్ తో పాటు కామెడీ కూడా బాగా వ‌ర్కోంట్ అయింద‌ని సినీ ప్రియులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. బాల‌య్య మ‌రియు మిగిల‌న న‌టులు త‌మ పాత్ర‌కు పూర్తి న్యాయం చేశార‌ని అంటున్నారు. కొన్ని కొన్ని మైన‌స్ లు ఉన్నా బాల‌య్య ఖాతాలో మ‌రో హిట్ ఖాయ‌మ‌నే టాక్ బ‌లంగా వినిపిస్తోంది.

ఇక టాక్ పాజిటివ్ గా ఉండ‌టంతో ఫ్యాన్స్ ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి. భగవంత్ కేసరి బెన్ఫిట్ షో తర్వాత అభిమానులు థియేట‌ర్స్ ఎదుట టపాసులు కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు. అలాగే ఒక థియేటర్‌ వద్ద బాలయ్య కటౌట్ కి ఏకంగా మ్యాన్షన్ హౌజ్ మందుతో అభిషేకం చేశారు ఫ్యాన్స్. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతుండ‌టంతో.. ఇదేం అభిమానం రా బాబు అంటూ నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నాడు.