రాధిక – శరత్ కుమార్ అగ్రిమెంట్ ప్రకారమే పెళ్లి చేసుకున్నారా.. కారణం..?

సీనియర్ హీరోయిన్ రాధిక సీనియర్ స్టార్ హీరో శరత్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరంలేదు. టాలీవుడ్ లోనే కాదు కోలీవుడ్లో కూడా ఈ జంటకు మంచి గుర్తింపు ఉంది. శరత్ కుమార్ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగడమే కాకుండా పలు చిత్రాలకు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. ఇకపోతే ఈయన హీరోగా కొనసాగుతున్న సమయంలోనే చాలామంది హీరోయిన్లను తన ట్రాప్ లో పడేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారట. ఇలా ఎంతోమంది ఆయనతో రిలేషన్ లో ఉన్నారనే వార్తలు వినిపిస్తూ ఉంటాయి. ఇకపోతే అప్పటికే ఒక వివాహం చేసుకొని ఇద్దరు పిల్లలకు తండ్రి అయిన ఈయన.. అనంతరం రెండో వివాహంగా నటి రాధిక ను వివాహం చేసుకున్నారు.

కానీ రాధికా అప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకుని ఇద్దరు భర్తలకి కూడా ఆమె విడాకులు ఇచ్చేశారు. ఇకపోతే ఈమె కూడా నటుడు శరత్ కుమార్ ను మూడో వివాహం చేసుకుంది. నిజానికి నటుడు శరత్ కుమార్ రెండవ వివాహంగా నటి దేవయానిని వివాహం చేసుకోవాల్సి ఉండేది… కానీ వీరిద్దరికీ పెళ్లి చేయాలని ఇరువురు కుటుంబ సభ్యులకు కూడా భావించారు. కానీ చివరి నిమిషంలో శరత్ కుమార్ దేవయానితో పెళ్లి క్యాన్సిల్ చేసుకుని రాధికతో కమిట్ అయ్యారు.

అయితే శరత్ కుమార్ ఉన్నట్టుండి దేవయానిని కాదని.. రాధికను వివాహం చేసుకోవడానికి కారణం డబ్బు అని తెలుస్తోంది. రాధిక ఇండస్ట్రీలో కొనసాగుతూ స్టార్ హీరోయిన్ గా భారీగా డబ్బు సంపాదించింది. డబ్బు కోసమే వివాహం చేసుకున్నారని సమాచారం. వాస్తవానికి శరత్ కుమార్ సినిమాలను నిర్మించి భారీగా నష్టపోవడంతో శరత్ కుమార్ స్నేహితుడు రాధికాకు పరిచయం చేసి రాధిక నుంచి తనకు కొంత డబ్బును అప్పుగా ఇప్పించారట. రాధిక నుంచి అప్పు తీసుకున్న రోజు నుంచి ఆమెతో ఆయనకు మంచి బంధం ఏర్పడిందని.. ఇది కాస్త ప్రేమగా మారి పెళ్లికి దారి తీసింది అని తెలుస్తోంది.

అయితే తనని పెళ్లి చేసుకోవాలంటే ఒక అగ్రిమెంట్ పై సంతకం చేయాలని.. రాధిక ఒక కండిషన్ పెట్టిందట. ఇక అగ్రిమెంట్లో ఏముందంటే పెళ్లి తర్వాత నా ఆస్తి మొత్తం నీ పేరిట రాస్తాను కానీ నువ్వు ఇంకో హీరోయిన్ వైపు కన్నెత్తి చూడకూడదని అగ్రిమెంట్ మీద సంతకం చేయించుకుందట. ఏదేమైనా ఈ అగ్రిమెంట్ పెళ్లి గురించి తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.