`భ‌గ‌వంత్ కేస‌రి`కి అనిల్ రావిపూడి షాకింగ్ రెమ్యున‌రేష‌న్.. హీరో రేంజ్ తీసుకున్నాడుగా!

టాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్స్ లో అనిల్ రావిపూడి ఒకడు. పటాస్ మూవీతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన అనిల్.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ను ఖాతాలో వేసుకుంటూ బ్రేకులు లేని బుల్డోజర్ గా దూసుకుపోతున్నాడ. అనిల్ రావిపూడి నుంచి వచ్చిన లేటెస్ట్ మూవీ `భగవంత్‌ కేసరి`.

ఈ సినిమాలో నట‌సింహం నందమూరి బాలకృష్ణ, కాజల్ అగర్వాల్ జంటగా నటించారు. శ్రీలీల, అర్జున్ రాంపాల్ తదితరులు కీలక పాత్రల‌ను పోషించారు. భారీ అంచనాల నడుమ అట్టహాసంగా విడుదలైన భగవంత్‌ కేసరికి పాజిటివ్ రివ్యూలు వెల్లువెత్తుతున్నాయి. మెజారిటీ పీపుల్ సినిమా బాగుందంటూ రివ్యూ ఇస్తున్నారు. బాలయ్య, అనిల్ ఖాతాలో మరో హిట్టు పడిందని అంటున్నారు.

ఇదిలా ఉంటే భగవంత్ కేస‌రి మూవీకి అనిల్ రావిపూడి తీసుకున్న రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్‌ టాపిక్ గా మారింది. అప‌జ‌యం ఎరుగని దర్శకుడిగా పేరు తెచ్చుకున్న అనిల్.. భగవత్ కేసరికి హీరో రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకున్నాడని అంటున్నారు. ఇన్‌సైడ్ టాక్‌ ప్రకారం అనిల్ ఈ మూవీ కోసం రూ. 12 నుంచి 14 కోట్ల రేంజ్ లో పారితోషికం పుచ్చుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వీర విహారం చేస్తే అనిల్ రెమ్యునరేషన్ మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదు.