మహేష్ బాబు ఫ్రెండ్‌గా నటించిన హీరో శివాజీ.. ఏ సినిమా అంటే..?

తెలుగు బిగ్ బాస్ సీజన్-7 ఆసక్తికరంగా సాగుతోంది. ఈ సారి ఉల్టా పుల్టా అంటూ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా నిర్వాహకులు ప్లాన్ చేస్తోన్నారు. ఎన్నో ట్విస్ట్ లు, సరికొత్త రూల్స్ పెడుతూ షోను కొత్త పద్దతితో తీసుకెళ్తున్నారు. ఊహకు అందకుండా.. సరికొత్తగా షోకు రూపకల్పన చేశారు. ఎవరు ఎప్పుడు కొత్తగా ఎంట్రీ ఇస్తారో.. ఎవరు ఎప్పుడు ఎలిమినేట్ అవుతారో తెలియడం లేదు. ఇక ఈ సీజన్ లో హీరో శివాజీ కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన విషయం తెలిసిందే. హౌజ్ లో అడుగుపెట్టిన దగ్గర నుంచి తన మైండ్ గేమ్ తో శివాజీ ఆడుతూ ముందుకెళ్తున్నారు.

అయితే శివాజీ గురించి చూస్తే.. హీరోగా అనే సినిమాలు చేసి ఎంతోమంది ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. అలాగే పలు సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ కూడా చేశాడు. అలాగే నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కూడా నటించి తనలోని నటనను బయటపెట్టాడు. అంతేకాకుండా చాలామంది హీరోలకు బ్యాగ్రౌండ్ వాయిస్ కూడా ఇచ్చాడు. హీరో నితిన్ కు జయం సినిమాలో శివాజీ వాయిస్ ఇచ్చాడు. అలాగే దిల్ సినిమాకు కూడా నితిన్ కు వాయిస్ ఇచ్చాడు. నితిన్ రెండు సినిమాలకు శివాజీ డబ్బింగ్ చెప్పాడు.

ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు పక్కన ఉన్న హీరో శివాజీ నటించాడు. యువ రాజు సినిమాలో మహేష్ బాబు స్నేహితుడిగా శివాజీ నటించాడు. వైవీఎస్ చౌదరి ఈ సినిమాను తెరకెక్కించగా… ఇందులో మహేష్, శివాజీ మధ్య వచ్చే సన్నివేశాలు అందరినీ ఆకట్టుకుంటాయి. అలాగే వైవీఎస్ చౌదరి డైరెక్షన్ లో వచ్చిన సీతారాముల కళ్యాణం చూతము రారండీ సినిమాలో శివాజీ నటించగా.. ఈ సినిమాతో మంచి గుర్తింపు పొందాడు. ఆ తర్వాత హీరోగా అనేక సినిమాల్లో నటించి యూత్ కు దగ్గరయ్యాడు.