500 కోట్ల క్లబ్బులో చేరిన హీరోయిన్స్ వీళ్ళే..!!

ఈ మధ్యకాలంలో పాన్ ఇండియా సినిమాల హవా ఎక్కువగా కొనసాగుతోంది. ముఖ్యంగా సినిమా సక్సెస్ అయిందంటే చాలు 500 కోట్ల నుంచి 1000 కోట్ల క్లబ్ లోకి చేరిపోయిన సినిమాలు చాలానే ఉన్నాయి. అలా బాహుబలి, బాహుబలి-2,RRR, రోబో-2.O, కే జి ఎఫ్-2, దంగల్, జైలర్, జవాన్ తదితర చిత్రాలు ఉన్నాయి వీటిలో మెజారిటీ సినిమాలు 1000 కోట్ల క్లబ్లో చేరాయి. ప్రభాస్, షారుక్, రామ్ చరణ్, ఎన్టీఆర్ యశ్ వంటి వారు 1000 కోట్ల క్లబ్ హీరోగా కూడా పేరు సంపాదించారు..

ఇక హీరోయిన్ల విషయానికి వస్తే 500 కోట్ల క్లబ్బులో సినిమాలలో నటించింది ఎవరనే విషయానికి వస్తే.. భారతీయ సినీ చరిత్రలో సుమారుగా డజన్మంది హీరోయిన్స్ సైతం 500 కోట్ల క్లబ్లో చేరడం ఆసక్తికరంగా ఉంది.. అలాంటి వారిలో అనుష్క, దీపికా పదుకొనే, సస్య మల్హోత్ర, శ్రీనిధి శెట్టి, అమీషా పటేల్ ఆలియాభట్ ఎమీ జాక్సన్ నయనతార తదితర మంది హీరోయిన్లు ఉన్నారు. ఇందులో కొంతమంది 1000 కోట్ల క్లబ్ లో చేరిన హీరోయిన్స్ కూడా ఉన్నారు..

బాహుబలి తో అనుష్క శెట్టి తన అందంతో నటనతో మంచి పాపులారిటీ అందుకున్నది. ఈ సినిమాలతో ఏమీ వెయ్యి కోట్లకు పైగా చేరడం జరిగింది. దంగల్ సినిమాతో ఫాతిమా సనా షేక్, సత్య మల్హోత్ర 500 కోట్ల క్లబ్ లో చేరారు. కే జి ఎఫ్-2 సినిమాతో శ్రీనిధి శెట్టి 1000 కోట్ల క్లబ్ లో చేరింది..RRR సినిమాతో ఆలియా భట్ 1000 కోట్ల మార్కుని అందుకుంది.2.O సినిమాతో ఎమీ జాక్సన్ ఐదు కోట్ల క్లబ్ లో చేరింది. పఠాన్ ,జవాన్ చిత్రాలతో 500 కోట్ల రూపాయలతో దీపికా పదుకొనే చేరింది. 1000 కోట్ల క్లబ్బులో జవాన్ సినిమాతో నయనతార 1000 కోట్ల క్లబ్లో చేరింది. అమీషా పటేల్ 500 కోట్లలో చేరింది.