మహాత్మా గాంధీ హెల్త్ హ్యాబిట్స్ గురించి మీకు తెలుసా..?

గాంధీ జయంతి అనేది మహాత్ముని జన్మదినం పురస్కరించుకుంటూ చేసుకునే వేడుకే కాదు. ఆయన జీవితం మరియు విశేషమైన ఆయన అలవాట్లను తెలుసుకొని దానిని ఫాలో అయ్యేందుకు. గాంధీజీ సరళమైన, లోతైన జీవన విధానాన్ని అనుసరించేందుకు అర్థవంతమైన జీవితాలను గడపడానికి మార్గదర్శకం కూడా. దగ్గర వరకు తెలిస్తే గడపడానికి తక్కువ సమయం ఉన్న ఈ రోజుల్లో గాంధీ అలవాట్లను అలవర్చుకోవడం వల్ల శారీరక మానసిక శ్రేయస్సు సానుకూలంగా మార్పులు వస్తాయి. గాంధీ యొక్క ఆరోగ్యకరమైన అలవాట్లు మీరు మీ జీవితాన్ని అన్వయించుకోండి.

వాకింగ్ మరియు రోజువారి శారీరక శ్రమ, గాంధీజీ దీనిని ఫాలో అవుతూ ఉండేవారు. రోజు వాకింగ్ చేస్తూ శారీరక శ్రమ చేయడం వల్ల మన శరీరంలో ఒత్తిడి తగ్గి అనవసరమైన కొలెస్ట్రాల్ వల్ల వచ్చే జబ్బులు కూడా అదుపులో ఉంటాయి. ఇక అదే విధంగా తక్కువ స్థాయిలో చక్కెర ఉప్పుని మరియు కొవ్వు పదార్థాలను గాంధీ తీసుకునే వారట. ఈ ఆరోగ్య అలవాటులను ఫాలో అవడం మీ ఆరోగ్యాని కూడా ఎంతో గ‌ణ‌న్నీయంగా మెరుగుపరుస్తుంది. పొగాకు మధ్యపానానికి నో చెప్పండి. పొగాకు, మధ్యపాన రహిత జీవితం కోసం గాంధీ గట్టి న్యాయవాది. వీటికి విరుద్ధంగా గాంధీ పోరాడాడు.

పర్యావరణ పరిశుభ్రత మనం నివసించే పర్యావరణాన్ని ప్రతి ఒక్కరు ఎవరికి వారుగా పరిశుభ్రంగా ఉంచుకుంటే పరిశుభ్రమైన భారతదేశాన్ని మనం చూడవచ్చు అనే అంశాన్ని గాంధీజీ బాగా న‌మ్మేవారు. వ్యక్తిగత పరిశుభ్రత అనేది గాంధీజీ ఉదాహరణగా నిలిచిన మరొక అంశం. క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవడం మంచి వ్యక్తిగత పరిశుభ్రత. అంటువ్యాధులు మరియు వ్యాధుల వ్యాప్తిని ఈ అల‌వాటుతో నిరోధించవచ్చు. ఇలాంటి సాధారణ అలవాట్లు మీ శ్రేయస్సును నిర్ధారించడానికి సహాయపడతాయి.