బాలీవుడ్ లో తారక్ హవా.. సల్మాన్ ఖాన్ సినిమాలో ఎన్టీఆర్..

జూనియర్ ఎన్టీఆర్ గొప్ప నటుడు అన్న సంగతి నిన్న మొన్నటి వరకు కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీకి మాత్రమే తెలుసు.కానీ ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా జూనియర్ ఎన్టీఆర్ నట విశ్వరూపం తెలిసింది. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం బాలీవుడ్ లో కూడా తారక్ హవా భారీ రేంజ్ లో కొనసాగుతుందని తెలుస్తుంది. ప్రస్తుతం ఎన్టీఆర్.. కొరటాల శివ డైరెక్షన్లో దేవర సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా సముద్ర నేపథ్యంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ తో వార్ 2 సినిమాలో ఒక నెగిటివ్ రోల్ లో హృతిక్ రోషన్ కు గట్టి పోటీ ఇచ్చే విధంగా ఎన్టీఆర్ పాత్ర ఉండబోతుందంటూ న్యూస్ వినిపించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కంటే ముందు సల్మాన్ ఖాన్ టైగర్ 3 సిరీస్ లో ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడట. టైగర్ 3 క్లైమాక్స్ సీన్ లో ఎన్టీఆర్ ఎంట్రీ ఉంటుందని సమాచారం. ఇక ఎన్టీఆర్ టైగర్ 3 లాంటి ప్రతిష్టాత్మక సినిమాతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తే అతని పోటీ గట్టిగా ఉంటుందని బాలీవుడ్ లో కూడా ఎన్టీఆర్ కెరియర్ బాగుంటుందని న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అది కూడా సల్మాన్ ఖాన్ లాంటి బాలీవుడ్ టాప్ స్టార్ హీరోతో నటించే అవకాశం దొరకడంతో ఎన్టీఆర్ కి ఇక మంచి బేస్ పడినట్లే అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ సినిమా తరువాతే హృతిక్ రోషన్ వార్ 2 సినిమాలో ఎన్టీఆర్ నటించబోతున్నాడట. ఇక ఈ సినిమా డిసెంబర్ చివరిలో లేదా జనవరి మొదటిలో షూటింగ్ స్టార్ట్ చేసుకుంటుందని సమాచారం.ఈ సినిమా ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్ సినిమాకు కూడా బాగా ప్లస్ అవుతుంది అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఎన్టీఆర్ పాన్ ఇండియా లెవెల్ లో కూడా ఉత్తమ నటుడిగా మంచి స్థానాన్ని దక్కించుకుంటాడని నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు.