ఆ అవ్వ చెయ్యి పట్టుకొని నడిపించిన సితార.. గొప్ప మనసు అంటూ ఫ్యాన్స్ పొగడ్తల వర్షం..

సూపర్ స్టార్ మహేష్ బాబు ముద్దుల కూతురు ఘట్టమనేని సితార గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం సితార తనసొంతంగా గుర్తింపు తెచ్చుకుంటుంది. ఈ క్రమంలోనే ఒక జ్యువలరీ షాప్ కి బ్రాండ్ అంబాసిడర్ కూడా అయింది. ఇక త్వరలోనే సినిమా లోకి అడుగు పెట్టబోతుంది అని మహేష్ సతీమణి నమ్రత శిరోత్కర్ తెలిపారు. సితార తన తండ్రి నట వరసత్వానే కాకుండా, తండ్రి లానే సేవా కార్యక్రమాలో కూడా ఎక్కువగా పాల్గొంటు ఉంటుంది.

మహేష్ బాబు అడుగు జాడల్లో నడుస్తున్న సితార సేవా కార్యక్రమాలో పాల్గొంటు ఎంతోమందికి రోల్ మోడల్ గా నిలుస్తుంది. ఇక తాజాగా మరోసారి సితార తన గొప్ప మనసుని చాటుకుంది . తాజాగా హైదరాబాద్ లో ఒక మాల్ లో మ్యాక్స్ బ్రాండ్ షోరూమ్ ఓపెన్ అయింది. ఈ కార్యక్రమానికి గెస్టులుగా సితార, నమ్రత హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో మ్యాక్స్ బ్రాండ్ వారు కొంతమంది పేద ముసలి వాళ్ళకి బట్టలు అందజేశారు. అయితే ఆ దుస్తులను సితార చేతుల మీదగా అందచేశారు. ఆ సమయంలో ఒక పెద్దావిడ స్టేజ్ పైకి ఎక్కేందుకు ఇబ్బంది పడుతుండగా సితార కిందకి దిగిన ఆ అవ్వ చేతులు పట్టుకొని జాగ్రత్తగా పైకి ఎక్కించింది . ప్రస్తుతం ఈ సంఘటన కి సంబందించిన వీడియో సోషల్ మీడియా లో తెగర వైరల్ అవుతుంది. ఇక వీడియో చుసినవాళ్లంతా సితార ది తన తండ్రి లానే గొప్ప మనసు అని పొగుడుతున్నారు.