పూజా హెగ్డే ఆస్తి ఎన్ని కోట్లో తెలుసా..?

టాలీవుడ్ లో మొదట నాగచైతన్య నటించిన ఒక లైలా కోసం అనే సినిమా ద్వారా తెలుగుతెరకు పరిచయమైంది హీరోయిన్ పూజా హెగ్డే..ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పర్వాలేదు అనిపించుకుంది అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోల సరసన నటించే అవకాశాన్ని అందుకున్న పూజా హెగ్డే తెలుగు, తమిళ్ ,హిందీ అనే భాషలలో కూడా నటిస్తూ బిజీగా ఉంటోంది.అయితే కొంతకాలం వరకు ఈమె హావ బాగానే కొనసాగిన ఈ మధ్యకాలంలో పెద్దగా సక్సెస్ కాలేకపోతోంది.

Pooja Hegde (Actress) Height, Weight, Age, Boyfriend, Family, Biography &  More » StarsUnfolded

దాదాపుగా పూజా హెగ్డే కి సక్సెస్ రాక రెండు సంవత్సరాలు పైనే అవుతోంది.అయినప్పటికీ ఈ అమ్మడికి అవకాశాలు మాత్రం వస్తూనే ఉన్నాయి. ఒప్పుకున్న ప్రాజెక్టుల నుంచి ఈ అమ్మడు కాస్త తప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పెళ్లి కోసమే సినిమాలను వదిలేస్తోంది అనే రూమర్లు కూడా వినిపించాయి. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఎన్నో సంవత్సరాలు అవుతున్న పూజా హెగ్డే ఆస్తి గురించి అభిమానులు తాజాగా వెతకడం జరిగింది.

పూజ హెగ్డే లైఫ్ స్టైల్ విషయానికి వస్తే ఈమె మొత్తం ఆస్తి విలువ 60 కోట్లకు పైగా ఉన్నట్లు సమాచారం. దాదాపుగా 20 సినిమాలలో నటించిన పూజా హెగ్డే పలు రకాల బ్రాండ్స్ కు అంబాసిడర్ గా వ్యవహరించింది ఒక యాడ్ కు 3 కోట్ల రూపాయలు తీసుకున్నట్లు సమాచారం. సోషల్ మీడియా ద్వారా దాదాపుగా ఒక్కోపోస్టుకి 40 లక్షల ఆదాయం పొందుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈమె వద్ద 2 కోట్లు విలువైన రెండు లగ్జరీ కార్లతో పాటు.. కోటి రూపాయలు విలువ చేసి బంగారు.. 10 కోట్ల రూపాయలు విలువ చేసి ఖరీదైన ఇల్లు.. మరొకచోట 4 కోట్లు చేసి ఇల్లు ఉన్నట్లు తెలుస్తోంది అలాగే పలు రకాల పొలాలతో పాటు స్థలాలు కూడా ఉన్నట్లు సమాచారం.