కమలహాసన్ తో శ్రీ‌దేవి పెళ్లి.. ఎవ‌రి వ‌ల్ల ఆగిపోయిందో తెలుసా?

అతిలోక సుందరిగా.. ఆరాధ్య దేవతగా.. ఎంతో మంచి గుర్తింపు దక్కించుకున్న దివంగత నటి శ్రీదేవి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. అయితే అప్పట్లో శ్రీదేవితో వర్క్ చేయడానికి దర్శక నిర్మాతలతో పాటు స్టార్ హీరోలు కూడా ఎగబడే వారు. బాలనటిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శ్రీదేవి ఆ తర్వాత స్టార్ హీరోయిన్గా రాణించింది.

అలా తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో వందల సినిమాలలో హీరోయిన్గా నటించి మంచి ప్రశంసలు అందుకుంది. అలా మూడు తరాల హీరోల సరసన హీరోయిన్గా నటించి అందర్నీ మెప్పించింది. శ్రీదేవి మొదట తమిళ సినిమాల్లో తన కెరీర్ మొదలుపెట్టిన ఆ తరువాత సౌత్ ఇండియా తో పాటు అనేక భారతీయ భాషల్లో నటించి అలరించింది.

ఇదిలా ఉంటే గతంలో శ్రీదేవి కమలహాసన్ వివాహం చేసుకోబోతున్నట్టు చాలా వార్తలు వచ్చాయి. వీరిద్దరి కాంబినేషన్లో ఆకలి రాజ్యం, వసంత కోకిల, ఓ రాధ ఇద్దరు కృష్ణులు వంటి బ్లాక్ బాస్టర్ హిట్ సినిమాలు వచ్చాయి.అయితే శ్రీదేవి కూడా తమిళమ్మాయి పైగా ఇద్దరు కూడా స్టార్ స్టేటస్ ను అనుభవించిన వారు కావడంతో.. ఆ రోజుల్లో శ్రీదేవిని పెళ్లి చేసుకోమని ఆమె తల్లి కమలహాసన్ ను అడిగారట. కానీ శ్రీదేవి తల్లి పెట్టిన పెళ్లి ప్రపోజలను కమలహాసన్ సున్నితంగా తిరస్కరించాడట.

దానికి గల కారణం శ్రీదేవిని ఆయన ఎప్పుడూ చెల్లెలి లాగా భావించే వారట. సినిమాలో వారి మధ్య లవ్ సీన్స్ ఉన్నప్పటికీ కూడా బయట మాత్రం ఎప్పుడూ ఆమెను ఆ భావంతో చూడలేదని.. ఆమె మీద ఎంతో గౌరవం ఉందని ఆయన చెప్పారట. అలా కమలహాసన్ నో చెప్పడంతో వీరిద్దరి పెళ్లి ఆగిపోయింది.

Share post:

Latest