ఐసీసీ మెన్స్ టి20 వరల్డ్ కప్ 20-20 యమ రసవత్తరంగా జరుగుతుంది. రీసెంట్ గానే బాంగ్లాదేడ్ తో తలపడిన భారత్ చివరి బాల్ వరకు ఉత్కంఠ భరితంగా సాగింది . కాగా ఎట్టకేలకు ఫైనల్ గా ఇండియా మ్యాచ్ విన్ అయ్యింది. కాగా నవంబర్ 6న ఇండియా-జింబాబ్వే తో తలపడినుంది . ఈ మ్యాచ్ కోసం ఇండియన్ క్రికెట్ అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు .
అయితే ఈ మ్యాచ్లో జింబాబ్వే-టీమిండియాను కానీ ఓడిస్తే ఆ దేశపు వ్యక్తిని పెళ్లి చేసుకుంటానని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చింది పాకిస్తాన్ నటి . దీంతో ఒక్కసారిగా అమ్మడు కామెంట్స్ వైరల్ గా మారాయి . ఎస్ పాకిస్తాన్ నటి అయినా షేహర్ షిన్వారి ట్విట్టర్ వేదికగా ఈ ప్రకటన చేసింది. ” త్వరలో జరగబోతున్న ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ లో ..జింబాబ్వే కానీ ఇండియాను చిత్తుగా ఓడిస్తే ఖచ్చితంగా నేను ఆ దేశపు వ్యక్తిని పెళ్లి చేసుకుంటానని” ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చింది.
దీంతో ఇండియన్స్ ఫుల్ ఫైర్ అవుతున్నారు . అంతేకాదు పాకిస్తాన్ ఇలాంటి చీప్ ట్రిక్స్ కూడా ప్లే చేస్తుందా అంటూ మండిపడుతున్నారు . ఆ నటి కి షాక్ ఇస్తూ ఇండియన్ క్రికెటర్ ఫ్యాన్స్ ఆమెను ట్రోల్ చేస్తున్నారు . “ఒకవేళ అదే నిజమైతే పాపం మీ జీవితాంతం పెళ్లి లేకుండా ఒంటరిగా జీవించాల్సిందే ..ఎందుకంటే ఇండియా ఓడిపోయే ప్రసక్తే లేదు “అంటూ చెప్పు కోస్తున్నారు. మరి కొంతమంది జింబాబ్వే ను భారత్ ఓడిస్తే నువ్వు ట్వీట్టర్ డిలీట్ చేయాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు ఒక పొరుగుతో ఓడించడానికి మాది పాకిస్తాన్ జట్టు కాదంటూ సెటైర్లు పేలుస్తున్నారు .