సినీ ఇండస్ట్రీలో మరో ప్రేమ జంట త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారు. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న బాలీవుడ్ స్టార్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీలు పెళ్లి చేసుకుని ఒక్కటి కాబోతున్నట్లుగా సమాచారం. అయితే వచ్చేనెల డిసెంబర్ లో వీరిద్దరి వివాహం అంగరంగ వైభవంగా ఇరువురి కుటుంబ సభ్యుల మరియు సన్నిహితుల సమక్షంలో జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే వీరి పెళ్లి చండీగఢ్ లోని `ది ఒబెరాయ్ సఖ్విలాస్ స్పా అండ్ రెస్టారెంట్స్` లో నిర్వహించబోతున్నట్టు తెలుస్తుంది. అయితే మొట్టమొదట వీరిద్దరూ తమ పెళ్లిని గోవాలో సిద్ధార్థ్ కుటుంబ సభ్యుల సమక్షంలో పంజాబీ సాంప్రదాయంలో చేసుకోవాలని భావించారట. కానీ అనివార్య కారణాలవల్ల చండీగఢ్ కు మార్చినట్లుగా టాక్ నడుస్తుంది.
తాజాగా కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న సిద్ధార్థ్.. కియారా తో ప్రేమా పెళ్లి గురించి పరోక్షంగా ప్రస్తావించాడు. అంతేకాకుండా స్టార్ హీరో షాహిద్ కపూర్ కియారాతో కలిసి అదే షోకి వచ్చినప్పుడు కియారా పెళ్లి డిసెంబర్ లో జరుగుతున్నట్లు పక్కాగా క్లారిటీ ఇచ్చేసాడు. అయితే వీరిద్దరూ డిసెంబర్ లో పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న `ఆర్సీ 15` సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జంటగా కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరగగా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.