హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం సామ్ మంచి స్వింగ్ లో వుంది. వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తూ, పైగా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలను చేస్తూ మంచి బిజీగా వుంది. ఫామిలీ మేన్ 2 మరియు పుష్ప సినిమా తరువాత సామ్ స్టార్ డం అమాంతం పెరిగిపోయింది. ఈ తరుణంలో ఓ వ్యాధి సమంతని కబళించడం అటు సినిమా వర్గాల్లోని, ఇటు సమంత అభిమానుల్లోని తీవ్రమైన కలకలం రేపింది. మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో ఆమె ప్రస్తుతం బాధ పడుతుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఈ విషయం తెలిసి వారం రోజులు కూడా కాకముందే టాలీవుడ్ లో మరో దర్శకుడికి ఓ వ్యాధి సోకిందని గుసగుసలు వినబడుతున్నాయి. జాతిరత్నాలు దర్శకుడు.. తాజాగా ప్రిన్స్ అనే సినిమాతో తమిళనాట అడుగుపెట్టిన అనుదీప్ సైతం ఒక భయంకర వ్యాధితో బాధ పడుతున్నట్టు చెప్పాడు. ఒక సీనియర్ జర్నలిస్ట్ దర్శకుడు అనుదీప్ తో చేసిన ఇంటర్వ్యూలో తనకు సోకిన అరుదైన వ్యాధి గురించి మాట్లాడాడు. తనకు HSP (హైలీ సెన్సీటీవ్ పర్సన్) అనే డిజార్డర్ ఉందని.. ఈ వ్యాధి ప్రపంచంలో ఇంకా ఎక్కడ ద్రువీకరించలేదని.. ఇంకా పరిశోధనల్లోనే ఉందని.. చెప్పుకొచ్చాడు.
అలాగే దీనికి ఎలాంటి మందులు కూడా మెడికల్ గైడ్ లైన్స్ లో లేవని చెప్పాడు తన స్టైల్ లో చెప్పాడు అనుదీప్. తనకు గ్లూటెన్ పడదని.. కాఫీ తాగితే 2 రోజుల పాటు నిద్ర రాదని.. ఏదైనా పళ్ల రసం తాగితే మైండ్ కామ్ అవుతుందని కూడా తెలిపాడు. ఎక్కువ కాంతి వంతమైన లైట్లు చూసినా, ఘాటైన వాసనలు చూసినా తట్టుకోలేనని.. దాంతో చాలా త్వరగా అలసిపోతానని చెప్పుకొచ్చాడు. కానీ తన సొంత రీసెర్చ్ తో ఈ వ్యాధి లక్షణాలని అర్ధం చేసుకుని తానె రూపొందించుకున్న సొంత డైట్ తో వ్యాధిని కంట్రోల్ లో పెట్టుకుంటున్నట్టు తెలిపాడు అనుదీప్.