పశ్చిమ ప్రకాశంపైనే టీడీపీ ఫోకస్… కారణం…!?

తెలుగుదేశం పార్టీ టార్గెట్ ఒకటే… అది రాబోయే ఎన్నికల్లో గెలుపు. ఇందుకోసం ఇప్పటి నుంచే అవకాశం ఉన్న అన్ని మార్గాలను వాడేస్తున్నారు. ఏడాది ముందే మ్యానిఫెస్టో ప్రకటన, అభ్యర్థుల ఎంపిక కూడా పూర్తి చేస్తున్నారు. దీనితో పాటు టీడీపీకి పట్టున్న నియోజకవర్గాలతో పాటు ఇప్పటి వరకు టీడీపీకి ఎదురు దెబ్బలు తగిలిన నియోజకవర్గాలపై కూడా చంద్రబాబు స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. 2009లో నియోజకవర్గాల పునర్ విభజన తర్వాత టీడీపీ వరుసగా ఓడిన నియోజకవర్గాల్లో ఈసారి ఎలాగైనా […]

టీడీపీలో అసంతృప్తులు… గుర్తింపు కోసం పాట్లు…!

తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు అధిపత్య పోరు టీడీపీ అధినేతను కలవరపెడుతోంది. ఎలాగైన గెలవాలని ఓ వైపు చంద్రబాబు తాపత్రయ పడుతుంటే… పార్టీ తమకు గుర్తింపు ఇవ్వడం లేదని కొందరు సీనియర్లు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. 40 ఏళ్ల తెలుగుదేశం పార్టీ ప్రస్తానంలో కేవలం కొంతమందికే గుర్తింపు దక్కుతోందని.. పార్టీ కోసం నిరంతరం కష్టపడిన వారికి గుర్తింపు రావడం లేదనే మాట ఇప్పుడు పెద్దఎత్తున వినిపిస్తోంది. వాస్తవానికి పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా పార్టీ జెండా మోసిన కార్యకర్తలకు పార్టీలో […]

పవన్ ఈ సారి ఎక్కడ నుంచి పోటీ చేస్తారూ….!?

పవన్ కల్యాణ్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారు… గతంలో మాదిరిగా రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తారా… లేక ఒకటే నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగుతారా…. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలు కాకుండా… అన్న చిరంజీవిలా రాయలసీమకు వెళ్తారా… ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో వినిపిస్తున్న ప్రశ్నలు. వీటికి జనసేన పార్టీ అధికారికంగా ఎలాంటి ప్రకటన ఇవ్వకపోయినప్పటికీ…. పవన్ వ్యవహరిస్తున్న తీరు మాత్రం క్లారిటీ ఇచ్చేస్తోంది. పొలిటికల్ సర్కిల్‌లో వినిపిస్తున్న మాటకు పవన్ తన వారాహి యాత్రతో ముంగింపు […]

రాజమండ్రిలో ఆధిపత్య పోరు… ఎవరెవరికో తెలుసా…!?

రాజమండ్రి అసెంబ్లీ నియోజకవర్గంలో ఆధిపత్య పోరు నడుస్తోంది. అది ప్రధానంగా తెలుగుదేశం పార్టీలో తారాస్థాయికి చేరుకుందనే చెప్పాలి. గత ఎన్నికల్లో జగన్ హవాలో సైతం రాజమండ్రి పరిధిలోని రెండు నియోజకవర్గాల్లో కూడా టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. రాజమండ్రి సిటీ నుంచి ఆదిరెడ్డి భవాని, రూరల్ నియోజకవర్గం నుంచి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గెలిచారు. దీంతో రాజమండ్రి టీడీపీ అడ్డా అనే మాట వినిపిస్తోంది. అయితే రాబోయే ఎన్నికల్లో మాత్రం టీడీపీకి ఎదురుదెబ్బలు తప్పవనే మాట బలంగా […]

రోజుకో నియోజకవర్గం.. ఇది ఎలా సాధ్యం….!

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ప్రకాశం జిల్లాలో కొనసాగుతోంది. వాస్తవానికి నెల్లూరు జిల్లా చేరే వరకు పరిస్థితి ఒకలా ఉన్న పాదయాత్ర… ప్రకాశం జిల్లాలోకి ప్రవేశించిన తర్వాత మరోలా మారిపోయిందనే మాట వినిపిస్తోంది. పాదయాత్ర కోసం టీడీపీ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. ఇప్పటి వరకు జరిగిన యాత్రకు భిన్నంగా… భారీ ఫ్లెక్సీలు, కటౌట్‌లతో తమ సత్తా ఏమిటో చూపిస్తున్నారు. అయితే జిల్లాలో కొనసాగుతున్న లోకేశ్ పాదయాత్రపై […]

శ్రీకాకుళం జిల్లా టీడీపీలో ఆధిపత్య పోరు…!

రాజకీయ చైతన్యం ఉన్న జిల్లాలో శ్రీకాకుళం ఒకటి. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా నుంచి రాజకీయాల్లో కొనసాగుతున్న వారిలో దాదాపు అందరూ సీనియర్లే. కిమిడి కళా వెంకట్రావు, కావలి ప్రతిభా భారతి, గుండ అప్పల సూర్యనారాయణ, కోండ్రు మురళీమోహన్, గౌతు శ్యామ్ సుందర్ శివాజీ, ధర్మాన సోదరులు, తమ్మినేని సీతారాం, కూన రవికుమార్, కింజరాపు అచ్చెన్నాయుడులు రాష్ట్రస్థాయి పదవులు అనుభవించిన వారే. వీరిలో ప్రతిభా భారతి స్పీకర్, కూన రవి కుమార్ ప్రభుత్వ విప్‌గా కొనసాగారు. మిగిలిన వారంతా […]

మేయర్ గారు…. జర ఇటు కూడా కాస్త చూడండి..!

హైదరాబాద్ నగర మేయర్ మీకు ఎక్కడైనా కనిపించారా… అసలామె ఉన్నారా… ఎక్కడైనా కనిపిస్తే చెప్పండి ప్లీజ్… ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే వైరల్ పోస్ట్. నిజమే హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి ఏమయ్యారనేదే ఇప్పుడు హాట్ టాపిక్. రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక హైదరాబాద్ సంగతి సరే సరి. చినుకు పడుతోంది అంటే చాలు. నగర వాసుల గుండెల్లో రైళ్లు పరిగెడుతాయి. అస్తవ్యస్తమైన డ్రైనేజీ వ్యవస్థ కారణంగా… రోడ్లన్నీ చిన్నపాటి వర్షానికే […]

దేశంలో బీజేపీ సర్కార్ హ్యాట్రిక్ సాధ్యమేనా…!?

దేశంలో తిరుగులేని నేతగా గుర్తింపు పొందిన నేత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. 2014లో లోక్ సభలో తొలిసారి కాలుపెట్టిన మోదీ… వరుసగా రెండు సార్లు ప్రధానిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నమో నినాదంతో తొలిసారి, అబ్ కీ బార్ మోదీ సర్కార్ అంటూ రెండోసారి ఎన్డీయే సర్కార్ ఏర్పాటయ్యింది. ఇక మూడోసారి కూడా గెలుపు తమదే అని బీజేపీ నేతలు ఇప్పటి నుంచే ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే పరిస్థితి మాత్రం ఆ స్థాయిలో లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. […]

ఇలా అయితే టీడీపీ గెలిచినట్లే…!

ఈసారి గెలవకపోతే…. ఇక భవిష్యత్తు లేదనేది తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట. ఇందుకోసం ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాల్సిందే అని ఇప్పటికే పార్టీ నేతలు, కార్యకర్తలకు స్పష్టం చేసేశారు కూడా. ఇందుకోసం గతానికి భిన్నంగా దాదాపుగా రెండేళ్ల ముందు నుంచే చంద్రబాబు కదన రంగంలోకి దిగారు. గతంలో ఎన్నడూ లేనట్టుగా ఎన్నికలకు ఏడాది ముందే మేనిఫెస్టో ప్రకటన, అభ్యర్థుల ఎంపిక చేసేస్తూ… పార్టీ శ్రేణులను సైతం ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు […]