కన్నడ ఇండస్ట్రీలో దర్శకుడుగా అడుగుపెట్టి తన సత్తా చాటుకున్న ప్రశాంత్ నీల్ అతి తక్కువ సమయంలోనే పాన్ ఇండియా లెవెల్‌కు ఎదిగాడు. తన సినిమాలతో.. సంచలనాలు సృష్టించాడు. ప్రస్తుతం ప్రశాంత్.. ఎన్టీఆర్ తో సినిమా పనుల్లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. డ్రాగన్ వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో.. తారక్ మునుపెన్నడూ లేని విధంగా డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్నాడు. ఇక.. ఈ సినిమా కోసం టీజర్ జనవరి 26న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సన్నిహిత వర్గాల సమాచారం. ఇక ప్రశాంత్ నీల్ తన సినిమాల్లో హీరోలను ఏ రేంజ్‌లో ఎలివేట్ చేస్తాడో.. క్యారెక్టరైజేషన్ ఎంత పవర్ఫుల్ గా చూపిస్తాడో మనకు తెలిసిందే.

కేజిఎఫ్ సినిమాలో ఏ రేంజ్ లో అయితే యష్‌ను ఎలివేట్ చేశాడో.. సలార్‌లో ప్రభాస్‌ను సైతం అంతే పవర్ ఫుల్ గా చూపించాడు. ఇక ఈ రెండు సినిమాలు పాన్ ఇండియా లెవెల్‌లో బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. ఇప్పుడు.. తారక్‌ను సైతం అంతే పవర్ఫుల్‌గా చూపించాలని ఫిక్స్ అయ్యాడట. అయితే.. ప్రశాంత్ నీల్ సినిమాలన్నీ మంచి సక్సెస్‌లు అందుకున్నా.. ఒక్క ఇండస్ట్రియల్ హిట్ కూడా ఆయన కెరీర్‌లో లేదు. ఈ క్రమంలోనే.. ఈ డ్రాగన్ తో ఎలాగైనా ఇండస్ట్రియల్ హిట్ కొట్టాలని కసితో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక తారక్ విషయానికి వస్తే.. గత సినిమాలన్నింటితో పోలిస్తే ప్రశాంత్ నీల్ సినిమాల్లో మరింత హై యాక్షన్, ఎలివేషన్స్‌తో కనిపించనున్నాడట.

రాజమౌళి సినిమాలో ఎన్టీఆర్‌ను చూసిన ఫీల్.. మించిపోయేలా ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయని టాక్ నడుస్తుంది. ఇక.. ఎన్టీఆర్ నటన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఏదైనా ఒక పాత్ర ఇస్తే అందులో జీవించేస్తాడు. ఈ క్రమంలోనే నీల్ ఇచ్చే ఈ పవర్ ఫుల్ పాత్రలో ఎంతవరకు పర్ఫెక్ట్ గా పోర్ట్ ట్రే చేయగలుగుతాడు. ఆడియన్స్‌ను పిక్స్ లెవెల్లో ఆకట్టుకుంటాడా.. లేదా.. చూడాల్సి ఉంది. ఇక ఎన్టీఆర్ సైతం ఈ సినిమాతో హిట్ కొడతామని ధీమాతో ఉన్నాడట. మరి ఎన్టీఆర్, నీల్ అంచనాలను నిజం చేస్తూ ఈ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలుస్తుందా.. లేదా.. తెలియాలంటే కొద్దిగా కాలం వెయిట్ చేయాల్సిందే.

