” శంభాల ” ఫస్ట్ రివ్యూ.. ఆది హిట్ కొట్టాడా..?

టాలీవుడ్ హీరో ఆది సాయికుమార్ మరికొద్ది రోజుల్లో శంబాల సినిమాతో ఆడియన్స్ను పలకరించేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసింది. గత కొద్ది కాలంగా ఆది నుంచి వచ్చిన సినిమాలన్ని డిజాస్టర్లుగా మారుతున్నాయి. ఈ క్రమంలోనే.. తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌పై ఫుల్ ఫోకస్ పెట్టిన ఆది.. ఎలాగైనా హిట్ కొట్టాలని కసితో ఉన్నాడట. అంతేకాదు.. మొదటి నుంచే ఈ కంటెంట్ బాగుండడంతో సినిమా స్టోరీ విషయంలో చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు తెలుస్తుంది. దీంట్లో భాగంగానే సినిమా ప్రమోషన్స్‌లో సైతం సినిమాతో సూపర్ సక్సెస్ కొడతామంటూ ధీమా వ్యక్తం చేస్తున్నాడు.

Aadi's Shambhala to Release on Christmas

యుగంధర్ ముని దర్శకుడుగా వ్యవహరించిన ఈ సినిమా ఈ నెల 25న ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ తో ఆడియన్స్ లో భారీ హైప్‌ను క్రియేట్ చేసిన టీం.. తాజాగా ఇండస్ట్రీ పెద్దల కోసం స్పెషల్ ప్రిషోస్‌ను వేశారు. ఇక మూవీ పూర్తిగా వీక్షించిన ఇండస్ట్రీ పెద్దలు తమ అభిప్రాయాలను వెల్లడించారు. దాన్ని బట్టి సినిమా ఫస్ట్ రివ్యూ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. అసలు స్టోరీ ఏంటంటే.. ఓ ఊర్లో కొన్ని మిస్టరీయ‌స్ సంఘ‌ట‌న‌లు జరుగుతూ ఉంటాయి. వాటిని బేస్ చేసుకుని ఊర్లో జనం అంతా.. ఊర్లో ఏదో అప‌చారం జరుగుతుందని.. కొద్ది రోజుల్లో ఊరు మసై పోతుందంటూ భయపడిపోతూ ఉంటారు.

అదే టైంలో హీరో అక్కడికి ఎంట్రీ ఇచ్చి.. అసలు ఊళ్లో ఏం జరుగుతుంది.. నిజంగా దేవుడు(శివుడు) ఉన్నాడా.. ఎందుకని ఊరు ఇలా అల్లకల్లోలంగా మారిందని విషయాలు తెలుసుకునే పనిలో పడతాడు. హీరో నాస్తికుడు కావడంతో.. ఈ అన్వేషణలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు.. చివరకు అసలు ఊళ్లో ఏం జరుగుతుందో కనిపెట్టాడా.. లేదా.. తెలియాలంటే థియేటర్లో చూడాల్సిందే. ఇక సినిమాను మొదటి నుంచి దర్శకుడు సస్పెన్స్ థ్రిల్లర్‌గా తీసాడ‌ట‌. ఫస్ట్ సీన్‌తోనే ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ మూవీ చివరి వరకు అదే టెంపోను మెయింటైన్ చేస్తూ ముందుకు సాగిందని.. అక్కడక్కడ సినిమా గ్రాఫ్ తగ్గుతూ వచ్చిన సినిమాలో హై ఓల్టేజ్ సీన్స్ చూపించి రక్తి కట్టించే ప్రయత్నం చేశాడని తెలుస్తుంది.

Shambhala: Aadi Saikumar's Big-Budget Supernatural Thriller Stuns with  Making Video

ఇంటర్వెల్లో వచ్చే ట్విస్ట్‌లు ప్రేక్షకులకు కచ్చితంగా థ్రిలింగ్‌గా అనిపిస్తాయ‌ని.. సెకండ్ హాఫ్ మొత్తం హై వోల్టేజ్ టెంపో మైంటైన్ చేస్తూ తీసుకెళ్లినట్లు సమాచారం. క్లైమాక్స్ ట్విస్ట్‌కు ప్రేక్షకుల ఫ్యూజ్‌లు ఎగిరిపోతాయని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. డైరెక్టర్ సినిమా థ్రిల్లింగ్ అంశాలు ఎక్కువగా ఉండే విధంగా ప్లాన్ చేసి.. పర్ఫెక్ట్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందించార‌ని.. మ్యూజిక్ కూడా ఆకట్టుకుంటుంది అంటూ తెలుస్తుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు చాలా హెల్ప్ అయిందట. విజువల్స్ కూడా ఆకట్టుకున్నాయని.. సిజ్‌ వర్క్ అంతా పర్ఫెక్ట్ గా మ్యాచ్ చేయకపోయినా.. సినిమా ఓవరాల్ గా మాత్రం ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యేలా.. కొత్త ఫీల్ ఇచ్చేలా ఉందని ఇప్పటివరకు సినిమా చూసిన సెలబ్రిటీస్ అభిప్రాయాలు వ్యక్తం చేస్తుండటం విశేషం. ఇక సినిమాతో టీమ్ ఆడియన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటారో చూడాలి.