తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ జైలర్ 2పై ఆడియన్స్‌లో మంచి హైప్ మొదలైంది. ఫస్ట్ పార్ట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడంతో.. మొదటి నుంచే మంచి అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా నెల్సన్ దిలీప్ కుమార్ మళ్ళీ ఈ సినిమాకు దర్శకత్వం బహిస్తుండటంతో ఆడియన్స్‌లో అంచనాలు ఆకాశానికి అంటాయి. ఇప్పటికే సినిమాలో పలువురు స్టార్ హీరోలు, ప్రముఖ నటులు క్యామియా పాత్రలో కనిపించనున్నారని.. మూవీ యూనిట్ ముందుగానే క్లారిటీ ఇచ్చేశారు. అయితే.. తాజాగా కోలీవుడ్ ఇండస్ట్రీ నుంచి మరో స్టార్ హీరో.. విజయ్ సుతుపతి కూడా ఒ కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.
ప్రస్తుతం గోవాలో ఈ మూవీకి కావాల్సిన కొన్ని ఇంపార్టెంట్ సీన్స్‌ను సర్వే గంగా షూట్ కంప్లీట్ చేస్తున్నారట. అయితే విజయ్ నిజంగా జైలర్ 2లో భాగమయ్యాడా.. లేదా.. అనే ప్రశ్నకు అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేవరకు చూడాల్సిందే. ప్రస్తుతం ఈ వార్తలు కోలీవుడ్ వర్గాల్లో తెగ వైరల్‌గా మారుతున్నాయి. అయితే.. అభిమానులు మాత్రం అప్డేట్‌పై కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నారు. కారణం.. గతంలో విజయ్, రజినీకాంత్ కలిసి.. కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్‌లో పేట సినిమాలో నటించారు.
ఈ సినిమా అప్పట్లో వచ్చిన రెస్పాన్స్ విజయ్ సేతుపతి పాత్రపై కలిగిన ప్రభావంతో ఈసారి మళ్లీ వీళ్ళిద్దరి కాంబో ఎలా ఉండబోతుందో అనే టెన్షన్ ఆడియన్స్ లో మొదలైంది. కాగా.. ఇప్పటికే సినిమాలో ముగ్గురు స్టార్ హీరోలు ప్రత్యేక పాత్రల్లో నటిస్తున్నట్లు న్యూస్ ఎప్పటి నుంచో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో పెద్ద పేరు కూడా ఈ సినిమాలో వినిపించడంతో సోషల్ మీడియాలో జైలర్ 2 హాట్ టాపిక్‌గా మారింది. ఇక.. ఈ సినిమాలో నెల్సన్ ఎంతమందిని రంగంలోకి దింపుతాడు.. ఇంకా ఎంతమంది స్టార్ హీరోస్ సినిమాలో పనిచేయబోతున్నారో.. అని ఆసక్తి మాత్రం అభిమానిలో మొదలైంది. ఇక సినిమాలో స్టార్ కాస్టింగ్ అఫీషియల్ అనౌన్స్మెంట్ కోసం కేవలం రజిని ఫ్యాన్స్ కాదు.. ట్రేడ్ వర్గాలు, సినీ అభిమానుల సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.



