తెలుగు సెన్సేషనల్ డైరెక్టర్‌గా మొదటి సినిమాతోనే తిరుగులేని రికార్డును క్రియేట్ చేశాడు ఆర్జీవి. అప్పట్లోనే పాన్ ఇండియన్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలో ప్రకంపనులు సృష్టించాడు. అలాంటి ఆర్జీవి.. ఇప్పుడు సినిమాలు తీసినా ఎవరూ పట్టించుకోని పరిస్థితి వచ్చింది. కానీ.. ఆర్జీవి రేంజ్ క్రేజ్ మాత్రం ఎప్పటికీ మారదు. ఆయన గత సినిమాల పరంగా అందరికీ ఎప్పుడు ఆయన అంటే ఇష్టం. ఇక.. తాజాగా రీ రిలీజ్ అయిన శివ సినిమాతో అది మరోసారి ప్రూవ్ అయింది. నాగార్జున హీరోగా.. ఆర్జీవి డైరెక్షన్లో వచ్చి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న శివ.. 35 ఏళ్ల తర్వాత తాజాగా నవంబర్ 14న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయింది.
4k చేసి.. సౌండ్ డిజైన్ మరింత ఇంప్రూవ్ చేసే సినిమా రీ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ క్రమంలోనే.. నాగర్జున, అర్జీవీ అభిమానులు శివ మూవీ రీ రిలీజ్‌ను భారీ సక్సెస్ చేశారు. సినిమా రిలీజ్ లో వచ్చిన కలెక్షన్స్ అందరికి షాక్‌ను కలిగిస్తున్నాయి. 1989లో రిలీజ్ అయిన ఈ సినిమా అప్పట్లోనే.. రూ.75 లక్షల బడ్జెట్‌తో తెరకెక్కి ఆల్మోస్ట్ రూ.4 కోట్లు కొల్లగొట్టింది. ఈ సినిమా అప్పట్లో ఇండస్ట్రీ హైయెస్ట్ గ్రసర్గా నిలిచింది. కేవలం నైజాం ఏరియాలోని కోటి రూపాయల కలెక్షన్ దక్కించుకుంది. ఇక అప్పట్లో లైఫ్ టైం వచ్చిన కలెక్షన్స్ అన్నిటిని.. ఇప్పుడు రీ రిలీజ్లో మూడు రోజుల్లోనే రూ.4.75 కోట్ల గ్రాస్ కొల్లగొట్టి రికార్డులు క్రియేట్ చేసింది.
ఇంకా థియేటర్స్ లో సినిమా కొనసాగుతూనే ఉంది. రూ.5 కోట్ల రౌండ్ ఫిగర్ సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఈ కలెక్షన్లు చూసి ఫ్యాన్స్‌తో పాటు.. మూవీ యూనిట్ అంతా ఆశ్చర్యపోతున్నారు. మూడు రోజుల్లో లైఫ్ టైం కలెక్షన్స్‌ను బ్రేక్ చేసిన క్రేజ్ ఆర్జీవి ది.. అది ఆయన రేంజ్ అంటూ ఆయన మనసుపెట్టి ఒక సినిమా తీస్తే రిజల్ట్ ఈ రేంజ్ లోనే ఉంటుందంటూ.. ఇప్పుడైనా ఒక్క సరైన సినిమా ఆర్జీవి నుంచి వస్తే.. ఆయన సృష్టించే రికార్డ్ల ముందు.. మరే డైరెక్టర్ పనికిరాడు అంటూ ఫ్యాన్స్ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.



