ఫ్యాన్స్ కు శ్రీ లీల బిగ్ షాక్.. మళ్లి ఆ హీరోతోనే సినిమానా.. !

టాలీవుడ్ యంగ్ బ్యూటి శ్రీ‌లీల‌ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతీ తక్కువ స‌మ‌యంలోనే.. దాదాపు స్టార్ హీరోల అందరి సినిమాలోని అవకాశాలు కొట్టేసింది. ఈ అమ్మడు ఇప్పటికి టాలీవుడ్ లో వరుస సినిమాలో నటిస్తూ బిజీబిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. తన అందం, అభిన‌యం, డ్యాన్స్ స్టెప్‌ల‌తో కట్టిపడేసిన ఈ ముద్దుగుమ్మ.. ఈ సినిమాల్లో మాత్రం ఊహించిన సక్సెస్‌లు అందుకోలేక పోతుంది. ఈ క్రమంలోనే.. అమ్మడి చేతిలో పెద్ద హిట్స్ ఇప్పటివరకు పడలేదు. కాగా.. తెలుగుతో పాటు శ్రీలీల.. మరో పక్క కోలీవుడ్, బాలీవుడ్ లోనూ అడుగుపెట్టి తన సత్తా చాటుకునే ప్రయత్నంలో బిజీగా ఉంది.

Parasakthi plot revealed: Sivakarthikeyan and Sudha Kongara's period drama  is all about…

ఈ క్రమంలోనే.. ఇప్పటికే శివ కార్తికేయని హీరోగా పెట్టి.. పరాశక్తి సినిమాలో మెరిసింది. ఈ సినిమాకు.. నేషనల్ అవార్డు విన్నర్ సుధా కొంగ‌రా దర్శకురాలుగా వ్యవహరిస్తుండడం విశేషం. ఈ క్రమంలోనే.. సినిమాపై ఆడియన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సంక్రాంతి బరిలో సినిమా గ్రాండ్ లెవెల్‌ రిలీజ్‌కు సిద్ధమవుతుంది. ఈ సినిమాతో.. శ్రీ లీలకు కోలీవుడ్‌లో మంచి బ్రేక్ దొరుకుతుంద‌ని ఫ్యాన్స్ థీమా వ్యక్తం చేస్తున్నారు. పరాశక్తి సినిమా రిలీజ్‌కి ముందే.. శ్రీ లీల కోలీవుడ్‌లో మరొ క్రేజీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటూ టాక్ ప్రస్తుతం తెగ వైరల్ గా మారుతుంది. ముఖ్యంగా.. ఈ కొత్త సినిమాలో కూడా శ్రీ లీలతో శివ కార్తీకేయ‌న్‌ హీరోగా మెరవనున్నాడట.

Sreeleela in Sivakarthikeyan's Parasakthi Directed by Sudha Kongara

సిబి చక్రవర్తి వీళ్లిద్ద‌రి రెండవ‌ ప్రాజెక్ట్‌కు దర్శకుడుగా వ్యవహరించనున్నాడని సమాచారం. ఈ కొత్త సినిమా షూటింగ్ కూడా డిసెంబర్ 10 నుంచి గ్రాండ్ లెవెల్ లో ప్రారంభం కానుందట. గతంలో సిబి చక్రవర్తి, శివ కార్తికేయన్ కాంబినేషన్‌లో తెర‌కెక్కిన డాన్ మంచి రిజల్ట్ అందుకుంది. ఈ క్రమంలోనే.. వీళ్లిద్దరి కాంబోలో సినిమా తెరకెక్కనున్న క్రమంలో.. ఈ ప్రాజెక్ట్ పై ఆడియన్స్‌లో సహజంగానే అంచనాలు నెలకొన్నాయి. అయితే.. ఫ్యాన్స్ లో మాత్రం నిరుత్సాహం కనిపిస్తుంది. దానికి కారణం వరుసగా మొదటి రెండు సినిమాలు ఒకే హీరోతో చేస్తే ఆమె కెరీర్ గ్రోత్ కు అది కాస్త ఇబ్బంది అవుతుందేమో అనే టెన్షన్ ఫాన్స్ లో మొదలైందట. రిపీటెడ్ గా ఒకే హీరోతో సినిమాలు చేస్తే ఆమె ఇమేజ్ పడిపోతుందేమో.. కొత్త హీరోస్‌తో ట్రై చేస్తే బాగుంటుంది.. వెరైటీ రోల్స్ ఎంచుకుంటే ఆమె కెరీర్‌కు అది ప్లస్ అవుతుంది అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.