” ఆయన పిలిస్తే అన్ని వదిలేసి వెళ్దాం “.. రేణు దేశాయ్ పోస్ట్ వైరల్

ఒకప్పటి స్టార్ హీరోయిన్.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్‌కు ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఈ అమ్మ‌డు త‌న‌ సినీ కెరీర్‌లో ఎంతోమంది స్టార్ హీరోలతో నటించి సూపర్ హిట్లు అందుకుంది. పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి దూరమైనా రేణు చాలా ఏళ్ల గ్యాప్ త‌ర్వాత‌.. 2023లో రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు తో మళ్ళీ రీ ఎంట్రి ఇచ్చింది. ఇందులో తను పోషించిన హేమలత లవణం పాత్రకు ప్రశంసలు ద‌క్కాయి.

ఇక‌.. ఈ సినిమా తర్వాత మరో సినిమాలో ఆమె నటించలేదు. కానీ.. రెణూ సినిమాలకు దూరంగా ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది. సాంఘిక సేవా కార్యక్రమాలతో పాటు పర్సనల్ విషయాలను సైతం సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ తో ముచ్చటించే రేణు దేశాయ్.. మహిళలు, చిన్నపిల్లలు, మూగజీవుల సమస్యల పట్ల సోషల్ మీడియా వేదికగా తన గళాన్ని వినిపిస్తూ. వాళ్లకు సపోర్ట్ గా నిలుస్తుంది. ఇక మూగజీవల్ల సంరక్షణ కోసమే ఓ స్వచ్ఛంద సేవ (ఎన్జీవో) ను కూడా ప్రారంభించింది.

ఇక రేణుకు దైవ భ‌క్తి కూడా ఎక్కువే. ఈ క్రమంలోనే రేణు దేశాయ్ షేర్ చేసిన ఓ పోస్ట్ వైరల్‌గా మారుతుంది. ఆమె తాజాగా కాశీలో దిగిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఈరోజు కాలభైరవ జయంతి రోజున మనం సంరక్షణ కోరుకోకూడదు.. మనమే రక్షకుడుగా మారాలి.. కాలభైరవుడు నీతో పాటు నడుస్తూ శాంతి మార్గంలో మిమ్మల్ని నడిపిస్తుంటాడు.. ఆ పరమశివుడు పిలిచినప్పుడు మీరు అన్ని వదిలేసి కాశీకి వెళ్తారు అంటూ ఓ క్రేజీ క్యాప్షన్‌ను జోడించింది. ఈ క్ర‌మంలోనే.. తన ఫోటోలతో పాటు.. ఆ క్యాప్ష‌న్ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతుంది.

 

View this post on Instagram

 

A post shared by renu desai (@renuudesai)