గత కొన్నేళ్లుగా టాలీవుడ్ రూమర్ కపుల్ గా విజయ్ దేవరకొండ, రష్మిక మందన సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నారు. వీళ్ళిద్దరు ప్రేమాయణం నడుపుతున్నారంటూ, డేటింగ్ లో ఉన్నారంటూ, ఇటీవల ఎంగేజ్మెంట్ కూడా అయిపోయిందంటూ వార్తలు తెగ వైరల్ గా మారుతున్నాయి. అయితే.. ఇద్దరు ఈ ఎంగేజ్మెంట్ ని అఫీషియల్ గా ప్రకటించకపోయినా.. విజయ్, రష్మిక ల టీం మీడియాకు సమాచారం అందించడం విశేషం. అంతేకాదు.. తర్వాత వీళ్ళిద్దరు ఎంగేజ్మెంట్ రింగ్స్‌తో దర్శనం ఇచ్చారు. దీంతో.. అంత నిశ్చితార్థం అయిపోయిందని ఫిక్స్ అయిపోయారు.

కాగా.. వీళ్ళిద్దరి ఎంగేజ్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత కూడా.. రష్మిక, విజయ్ పలు ఈవెంట్లలో సందడి చేసినా.. ఎక్కడ కూడా దీనిపై రియాక్ట్ అవ్వలేదు. ఈ క్రమంలోనే.. ఎప్పుడెప్పుడు ఈ విషయాన్ని అఫీషియల్ గా ప్రకటిస్తారా అంటూ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే.. తాజాగా ఓ వార్త నెటింట వైరల్‌గా మారుతుంది. రష్మిక ది గర్ల్ ఫ్రెండ్ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. ప్రజెంట్ మూవీ యూనిట్ అంతా ప్రమోషన్స్‌లో బిజీ బిజీగా ఉన్నారు. ఇక.. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు విజయ్ దేవరకొండ స్పెషల్ గెస్ట్ గా హాజరుకానున్నడంటూ టాక్ ప్రస్తుతం టాలీవుడ్ లో తెగ వైరల్ గా మారుతుంది.

దీంతో.. ఎంగేజ్మెంట్ తర్వాత మొదటిసారి విజయ్, రష్మికలు కలిసి ఒకే స్టేజిపై కనిపించనున్నారని ఫ్యాన్స్ లో ఆనందం మొదలైంది. అయితే.. ఇప్పటివరకు ఎన్నో సందర్భాల్లో వీళ్ళను దీనిపై ప్రశ్నించినా రియాక్ట్ కాలేదు. ఇప్పటికైనా.. ఒకే స్టేజ్ పై మెరవనున్నారు. ఈ క్రమంలోనే.. వీళ్ళిద్దరి పెళ్లి గురించి ఏదైనా అనౌన్స్మెంట్ ఇస్తారా లేదా.. ఎంగేజ్మెంట్ గురించి అఫీషియల్ క్లారిటీ అయిన ఇస్తారా.. ఇద్దరు కలిసి స్పెషల్ ఫోటోలకు స్టిల్స్ ఇచ్చేసి.. మళ్లీ మేటర్ లీక్ చేయకుండా తూచ్ అని తప్పించుకుంటారా.. వేచి చూడాలి.

