ఇండస్ట్రీలో ఎంతోమంది సెంటిమెంట్లను ఫాలో అవుతారు. అలా టాలీవుడ్ లో ఎన్నో సెంటిమెంట్లు వినిపిస్తుంటాయి. ఇందులో నవంబర్ నెలలో రిలీజ్ అయ్యే సినిమాలు పెద్దగా ఆడవని సెంటిమెంట్ కూడా ఒకటి. అందుకే ఈ నెలలో బడా సినిమాలేవి రిలీజ్ కావు. కేవలం చిన్న సినిమాలు మాత్రమే.. అది కూడా చాలా తక్కువ మంది రిలీజ్ చేస్తూ ఉంటారు. అయితే.. ఈ ఏడాది మాత్రం ఒకటి, రెండు పెద్ద సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ చేసి మేకర్స్ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అంతేకాదు.. ప్రస్తుతం ట్రెండ్‌కు తగ్గట్టు.. స్టార్ హీరోల సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి. మరి.. ఈ సినిమాలన్నింటిలో ఏన్ని సక్సెస్ అందుకున్నాయి. ఏవి ఫ్లాపులుగా నిలిచాయి.. నవంబర్ నెల టాలీవుడ్ రివ్యూ ఏంటో ఒకసారి చూద్దాం.

బ్యాడ్ సెంటిమెంట్ కు తగ్గట్టుగానే నవంబర్ డిజాస్టర్ తో ప్రారంభమైంది. భారీ అంచనాలతో నవంబర్ 1న రవితేజ మాస్ జాతర బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజై బోల్తా కొట్టింది. సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ డే ఫస్ట్ నుంచి నెగటివ్ టాక్ రావడంతో.. కనీసం థియేటర్ వైపు చూడడానికి కూడా ఆడియన్స్ ఇష్టపడలేదు. ఇక తర్వాత వారం మాత్రం ది గర్ల్ ఫ్రెండ్, జటాధర, ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమాలతో పాటు మరికొన్ని సినిమాలు ఆడియోస్ ను పలకరించాయి. వాటిలో ది గర్ల్ ఫ్రెండ్ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ది గ్రేట్ ఫ్రీ వెడ్డింగ్ షో మాత్రం అన్ ఎక్స్పెక్టెడ్ సక్సెస్. ఇక అదే వారంలో వచ్చిన మిగతా 5,6 సినిమాలు ఒక్కరోజులోనే థియేటర్ నుంచి తప్పుకున్నాయి.

ఇక రెండవ వారం నవంబర్ 14న కాంత, సంతాన ప్రాప్తిరస్తు, గత వైభవంతో పాటు మరో 5 సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో ఒక్క సినిమా కూడా సూపర్ హిట్ అందుకోలేకపోయింది. భారీ అంచనాలతో వచ్చి.. ప్లాపులుగా నిలిచాయి. అయితే ఇదే వారంలో రీ రిలీజ్ అయిన నాగార్జున శివ మాత్రం రికార్డు కలెక్షన్స్ను అందుకుంది. ఇక.. నవంబర్ 21న అయితే అల్లరి నరేష్ – 1ఏ రైల్వే కాలనీ, ప్రియదర్శి – ప్రేమంటే, రాజు వెడ్స్ రాంబాయి సినిమాలతో పాటు.. మొత్తం 21 సినిమాలు వచ్చాయి. కానీ.. ఏ ఒక్క సినిమా కూడా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోలేకపోయింది. రిలీజ్ అయినంతలో రాజు వెడ్స్ రాంబాయి మాత్రమే పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంది.

ఇప్పటికి థియేటర్లలో కొనసాగుతుంది. ఇక మెగాస్టార్ చిరంజీవి – కొదమసింహం, కార్తీ – ఆవారా సినిమాల రిరిలీజ్ అయ్యాయని కూడా చాలా మందికి తెలిసుండదు. ఇక నవంబర్ చివరి వారంలో రామ్ నుంచి ఆంధ్ర కింగ్ తాలుక, కీర్తి సురేష్ నుంచి.. రివాల్వర్ రీటా సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఆంధ్ర కింగ్ తాలూకా మిక్స్డ్ టాక్ తో యావరేజ్ ఓపెనింగ్స్ దక్కించుకుంది. ఇక రివాల్వర్ రేట్ ఫ్లాప్. అలా మొత్తంగా నవంబర్ నెలలో 35కు పైగా సినిమాలు రిలీజ్ కాగా.. వాటిలో కేవలం ది గర్ల్ ఫ్రెండ్, ది గ్రేట్ ఫ్రీ వెడ్డింగ్ షో, రాజు వెడ్స్ రాంబాయి మాత్రమే ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాయి. మిగతా అని మూవీప్ డీలపడ్డాయి. ఇక.. ఈ ఏడాదిలో డిసెంబర్ మాత్రమే మిగిలింది. టాలీవుడ్ లో ఈనెల రిలీజ్ అయ్యే సినిమాలు ఎలాంటి సక్సెస్ అందుకుంటాయో చూడాలి.

