” శంభాల “రివ్యూ.. ఆది సాయికుమార్ కి సాలిడ్ హిట్..!

హీరో: ఆది సాయికుమార్‌
మూవీ: శంబాల
నటీనటులు: అర్చన్‌ అయ్యర్‌, స్వసిక, రవివర్మ, మధునందన్‌, శివ కార్తీక్‌, లక్ష్మణ్‌
దర్శకత్వం: యుగంధర్‌ ముని
బ్యానర్: షైనింగ్‌ పిక్చర్స్
ప్రొడ్యూసర్: అన్నమోజు రాజశేఖర్‌, మహీధర్‌ రెడ్డి
రిలీజ్: గురువారం, డిసెంబర్‌ 25

టాలీవుడ్ సీనియర్ హీరో సాయికుమార్ తనయుడు ఆది సాయికుమార్ చాలా కాలం నుంచి ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే.. ఇటీవల కాలంలో ఆయనకు ఒక్క సరైనా సక్సెస్ కూడా లేదు. ఈ క్రమంలోనే.. తన లేటెస్ట్ ప్రాజెక్ట్ శంబాలతో ఎలాగైనా బ్లాక్ బస్టర్ కొట్టాలని కసితో ఉన్నాడు. యుగంధర్ ముని డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా ఇప్పటివరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్‌తో ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే.. సినిమాపై మంచి హైప్‌ మొదలైంది. ఇక తాజాగా.. క్రిస్మస్ కానుకగా.. డిసెంబర్ 25న(నేడు) గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయిన ఈ సినిమా.. ఆడియన్స్ లో ఎలాంటి రెస్పాన్స్‌ను దక్కించుకుందో.. ఆది ఈసారైనా సాలిడ్ హిట్ కొట్టడా.. లేదా.. ఒకసారి రివ్యూలో చూద్దాం.

స్టోరీ
శంబాల అనే ఊరిలో ఓ రాత్రి అకాశంనుంచి ఉల్క పడుతుంది. ఆ దెబ్బతో ఊరిలో అనుకోని మార్పులు మొద‌ల‌య్యాయి. రాములు(రవి వర్మ) ఇంటికి ప‌వ‌ర్ వ‌చ్చింది. ఈ క్రమంలోనే త‌న ఆవు ఇచ్చే పాలు రక్తంలా క‌నిపిస్తాయి. ఊరిలో అప్ప‌టినుంచి అపశకునాలు మొత‌ల‌వుతాయి. ఇక‌ సైంటిస్ట్ లకు ఈ విషయం తెలియ‌డంతో.. అస‌లా ఉల్క రాయి ఏమై ఉంటుంది..? దాని ప్రభావం ఎలా ఉంటుంది తెలుసుకోవాల‌ని.. సైంటిస్ట్ విక్రమ్‌(ఆది సాయికుమార్‌)ను ఆ ఊరికి పంపుతారు. అదే టైంలో రాములు ఆవుకి దెయ్యం ఆవ‌హించింద‌ని.. దాన్ని చంపాలని స్వామిజీ అంటాడు. అత‌ను, సర్పంచ్‌ ఆదేశాల మేరకు ఆవుని చంపేయాలని ఫిక్స్ అవుతారు.

కానీ.. రాములు తల్లి దాన్ని కాపాడ‌టానికి చూస్తుంది.. అయినా వెంబడిస్తున్న క్ర‌మంలో విక్రమ్‌ చూసి ఆ ఆవుని కాపాడాడు. త‌ర్వాత ఉల్కను ప‌రిక్షించ‌డం మెద‌లెట్టాడు. మ‌రో ప‌క్క ఊర్లో వింత ఘ‌ట‌న‌లు జరుగుతాయి. రాములు కార‌ణం లేకుండా.. త‌న‌కు తెలియ‌కుండానే చాలా మందిని చంపి.. తాను చనిపోతాడు. ఆ తర్వాత కృష్ణ(లక్ష్మణ్‌)ని ఆ నెగిటీవ్ ఎన‌ర్జీ పూనింది. మెడలో ఒక పురుగులా అది తిరుగుతూ.. ఆ వ్య‌క్తి కోరికలు తీర్చుకున్నాక.. ఆ మనిషిని చంపేస్తుంది. త‌ర్వాత మ‌రో మనిషిలోకి.. ఇక ఇదే కంటిన్యూ అయితే.. ఊరు మొత్తం వల్లకాడు అవుతుందని భావించి.. దాన్ని అంతం చేయాలని విక్రమ్‌తోపాటు.. ఊరు ప్రజలు ఫిక్స్ అవుతారు. మరి దాన్ని ఎలా అంతం చేశారు? దాన్ని విక్రమ్‌ ఎలా ఎదుర్కొన్నాడు? ఇందులో అర్చన రోల్‌ ఏంటి..? ఈ నెగిటీవ్ ఎన‌ర్జీ వెనుక ఉన్న ర‌హ‌స్యం ఏంటి..? శివుడికి ఈ కథకి మ‌ధ్య‌ లింకేంటి..? అనేది స్టోరీ.

Shambhala (2025) - IMDb

రివ్యూ
గత కొంతకాలంగా నేచురల్ అంశాలతో.. హారర్‌ ఎలిమెంట్స్ జోడించి సినిమాలను తీయ‌డం.. అవి హిట్ కొట్టడం కామన్ అయిపోయింది. ఓ రకంగా ఈ జోన‌ర్‌ సినిమాలు సక్సెస్ ఫార్ములాగా మారిపోయాయి. అలా.. విరూపాక్ష మూవీ వచ్చి సాలిడ్ స‌క్స‌స్ కొట్టింది.ఇప్పుడు శంభాల కూడా దాదాపు అదే జొన్నర్‌. అయితే.. విరూపాక్షను మించిపోయే కంటెంట్ ఈ సినిమాలో ఉంది. అంతు చిక్కని ట్విస్ట్‌లు, ఊహించని సస్పెన్స్‌లు ఎన్నో ఉన్నాయి. హారర్ ఎలిమెంట్స్‌కు పెద్దపీట వేశారు. ఇక ఫస్ట్ హ‌ఫ్ స్టోరీ అంతా ఉల్క చుట్టు తిరుగుతుంది. ఉల్కపడ్డాక ఊర్లో నెగటివ్ ఎనర్జీ రావడం, విచిత్రమైన సంఘటనలు జరగడంతో జనంలో భయం పెరిగిపోతుంది.

ఆ భూతం వల్లే ఇదంతా అని అంతా భావిస్తారు. రాములు ఆవు రక్తం పాలు ఇవ్వడం.. తనకి దెయ్యం పట్టిందని చంపేయాలని చూడడం.. ఆ ఆవును చంపకుండా విక్రమ్ అడ్డుకోవడంతో.. వారంతా విక్రంపై పగ పెంచుకుంటారు. మరో పక్కన విక్రం అసలు ఈ ఉల్క ప్రభావం.. ఆ స్పిరిట్ కు కార‌ణాలను రీసర్చ్ చేస్తూ ఉంటాడు. ఇందులో షాకింగ్ విషయాలు బయటకు వస్తాయి. అదే టైంలో రాముల మెడలో పురుగు కొట్టడం అది ఆయన్ను చిన్నబిన్నం చేయడమే కాదు.. తనని హేళన చేసిన ఆరుగురితోనే అతని చంపిస్తుంది. ఆయన చనిపోవడం అందరికీ షాక్. తర్వాత తన నుంచి కృష్ణకు ఆ పురుగు పాకడం అతను ఓ లేడీ పై కన్నీయడం.. ఆమెని అనుభవించాలని తపించి.. తర్వాత ఆమెను చంపి అతను కూడా చనిపోవడం.. ఇలా పురుగు ఒకరి మీద నుంచి మరొకరి దగ్గరకు వెళుతూ తన కోరికలు తీర్చుకుని.. ఆ వ్యక్తిని, ఎదుట వ్యక్తులను కూడా చంపేస్తుంది. ఈ క్రమంలో చోటు చేసుకునే సస్పెన్స్ లు ఆడియన్స్ ఆకట్టుకుంటాయి.

Shambhala (2025) - IMDb

అదే టైంలో కాస్త హారర్ కామెడీ ఎలిమెంట్స్ కూడా యాడ్ అయ్యాయి. ఇంటర్వెస్ట్ ఆడియన్స్ లో గూస్ బంప్స్‌ తెప్పిస్తుంది. ఇక ఆ పురుగు ఒకరి తర్వాత ఒకరికి పట్టి ఎన్నో చావులకు కారణంతో దాన్ని అడ్డుకునేందుకు.. విక్రమ్, మరో పక్కన ఊర్లో ఉన్న స్వామీజీ ఎన్ని ప్రయత్నాలు చేసినా.. అవి ఫలించవు. క్లైమాక్స్ వచ్చేంతవరకు కూడా ఇదే కొనసాగుతుంది. ఈ టైంలోనే అసలా పురుగు ఎవరినుంచి ఎవరికీ వెళ్ళిందని కనిపెట్టే ప్రయత్నాలు ఆడియన్స్ ను సీట్ ఎడ్జ్‌కు తీసుకొస్తాయి. ఒళ్ళు గ‌గ్ఉరుపొడుస్తూ, క్షణం క్షణం టెన్షన్ గా ఆడియన్స్ ఫీల్ అయ్యేలా స్టోరీ ఉంది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అదిరిపోయాయి. క్లైమాక్స్ మాత్రం వేరే లెవెల్. ఇక చిన్న పాపకు సంబంధించిన సీన్లతో అందరి హృర్ట్‌ టచ్ చేయడం, అదే టైంలో ఏం జరుగుతుందని క్యూరియాసిటీ ఆడియన్స్‌లో క్రియేట్ చేయడం.. సెకండ్ హాఫ్ మొత్తం ప్రశ్నలకు.. అన్ని సస్పెన్స్‌ల‌కు స‌మాధానం చూపించారు. లాస్ట్ 15 మినిట్స్ సినిమాకు టాప్ హైలెట్.

ప్ల‌స్‌లు
స్ట్రాంగ్ కథను ఎంచుకోవ‌డ‌మే కాదు.. కథను స్క్రీన్ పై చూపించే విధానంలో డైరెక్టర్ 100% సక్సెస్ అయ్యాడ‌ని చెప్పాలి. ఇక.. సినిమాకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మరింత ప్లస్. ఆడియన్స్‌ను భయపెట్టడంలో.. గూస్ బంన్స్ తెప్పించడంలో ప్రధాన పాత్ర పోషించిందని చెప్పాలి. నటీనటుల పర్ఫామెన్స్ తో పాటే.. కామెడీ హారర్ ఎలిమెంట్స్.. ట్విస్ట్‌లు, క్లైమాక్స్‌లు ఇలా.. ప్రతి ఒక్కటి సినిమాకు బలని చేకూర్చాయి.

Shambhala (2025) - IMDb

మైనస్ లు:
అక్కడక్కడ కొన్ని లాజిక్స్ మిస్ అయ్యాయి. దేవత.. అది వెంటే ఉంటుంది. కానీ.. ఎవరిని కాపాడకుండా.. ఏం చేయకుండా.. అలాగే ఎందుకు ఉండిపోయిందనేది అందరిలోనూ సందేహమే. సెకండ్ హాఫ్‌లో సేమ్ సీన్స్ రిపీట్ అవుతాయి. దానికి వివరణ ఇస్తూ కథ‌ను ఏదైనా టర్న్ చూపించాల్సింది. అంతేకాదు.. ఆది ఎక్స్పరిమెంట్‌లో కొన్ని సీన్స్ కూడా ఆర్టిఫిషియల్‌గా అనిపిస్తాయి.

నటీనటుల పర్ఫామెన్స్:
సైంటిస్ట్ విక్రం రోల్‌లో ఆది సాయికుమార్ అదరగొట్టాడని చెప్పాలి. తన బెస్ట్ ఇచ్చాడు. యాక్షన్ సీన్స్ లో దుమ్మురేపాడు. ఇప్పటివరకు ఆది కెరీర్‌లో ఈ సినిమా హూలెట్‌గా నిలిచిపోయుఏలా ఉంది. అంతేకాదు ఆదిలోని కొత్త షేడ్‌ను ఆవిష్కరించిన సినిమా ఇది. ఈ సినిమాలో తనతో పాటు నటించిన ప్రధానపాత్రలన్నింటినీ డామినేట్ చేసేలా అది నటన ఉంది. రాములు పాత్రలో.. రవి వర్మ మెప్పించాడు. కృష్ణ పాత్రలో.. లక్ష్మణ్ మరోసారి ఆకట్టుకున్నాడు. కామెడీతో, హారర్ ఎలిమెంట్స్ పండించాడు. దేవత పాత్రలో అర్చన ఆకట్టుకుంది. ఇతర నటినటులు ఎవరి పాత్రనడివిలో వాళ్ళు మెప్పించారు.

టెక్నికల్గా:
శ్రీ చరణ్ పాకాల మ్యూజిక్ హైలెట్. బిజిఎంతో ఆడియన్స్ లో పూన‌కాలు తెప్పించాడు. కెమెరా వర్క్ ఓకే. అక్కడక్కడ ఎడిటింగ్ కాస్త మెరుగ్గా ఉంటే బాగుండేది అనిపించింది. సినిమా నాణ్యత విలువలు క్లియర్గా అర్థం అవుతున్నాయి. యుగంధర్ మునీ డైరెక్టర్‌గా స్టోరీని ఎంచుకోవడంలో.. సినిమాలు చూపించడంలో 100% సక్సెస్ అయ్యారని చెప్పాలి. ఇటీవల కాలంలో ఇలాంటి జోనర్ సినిమాలు చాలానే వస్తున్నా.. వాటన్నింటిని మించిపోయేలా సరికొత్తగా, భిన్నంగా సాలిడ్ కంటెంట్ ను తెరపై చూపించాడు. ముఖ్యంగా హారర్ థ్రిల్ల‌ర్‌ ఎలిమెంట్స్, కామెడీని కూడా జోడించడం హైలెట్.

Press Note : Aadi's Shambhala Worldwide Premieres Today

చివరిగా:
ఆది కెరీర్ ను మలుపు తిప్పే సక్సెస్ ఫుల్ మూవీ అనిపిస్తుంది. హారర్, కామెడీ, ఎమోషనల్ అంశాల మేళ వింపే శంబాల.