పాన్ ఇండియన్ సెన్సేషనల్ డైరెక్టర్‌గా సందీప్ రెడ్డి వంగ ఎలాంటి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అర్జున్ రెడ్డి సినిమాతో తన కెరీర్ ను ప్రారంభించిన సందీప్.. ఈ సినిమా తర్వాత వచ్చిన కబీర్‌సింగ్, యానిమల్ సినిమాలతోనూ తన సత్తా చాటుకున్నాడున. ఇక ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ తో స్పిరిట్ సినిమా పనుల్లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా దేశభక్తి బ్యాక్డ్రాప్ లో తెరకెక్కనుందట. ఈ క్రమంలోనే తాజాగా సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ.. సినిమాకు సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ లీక్స్ షేర్ చేసుకున్నాడు.
బ్రిటిష్ కాలం నాటి కథతో ఈ సినిమా మన దేశ సైనికులు ఎలా పోరాడారు.. అందులో పోలీసులు సైతం తమ నీతి, ధర్మాన్ని కాపాడడానికి ఎలా బ్రిటిష్ వాళ్ళను ఎదిరిస్తారు.. అనే అంశాన్ని కూడా ఆసక్తికరంగా చూపించనున్నారట. అయితే.. ఇవన్నీ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ అన్ని తెలుస్తోంది. ఈ క్రమంలోనే సినిమా ఎంట్రీ ఏ రేంజ్ లో ఉండబోతుందో అనే ఆసక్తి అందరిలోనూ మొదలైంది. ఇక ప్రభాస్ ఈ సినిమాలో దేశభక్తితో పోరాడే సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడటా. ఇక.. తన నిజాయితీతో దేశాని ఎలా కాపాడాడు.. అనేదే కథ అని సమాచారం. ఇక ప్రభాస్ నుంచి ఇప్పటివరకు ఇలాంటి సినిమా రాలేదు.
దానికి తోడు ప్రభాస్ పోలీస్‌గా స్క్రీన్‌పై కనిపించడం ఇదే మొదటిసారి. ఈ క్రమంలోనే.. స్టోరీ నిజంగా పర్ఫెక్ట్‌గా డెలివరీ అయితే మాత్రం.. ఇండస్ట్రీ రికార్డ్‌లను బద్దలు కొట్టడం ఖాయం అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక.. సందీప్ ఎప్పటిలాగే కూల్ అండ్ చిల్ మూడ్‌లో తనదైన మార్క్ బోల్డ్ నెస్‌తో అన్ని సన్నివేశాలను చాలా క్లియర్ గా రూపొందిస్తున్నాడట. ఈసారి తన సినిమాతో యావత్ సినీ ఇండియన్ రికార్డులను బ్రేక్ చేయడమే టార్గెట్గా సందీప్ ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు సమాచారం. ఇక.. ప్రభాస్ లాంటి హీరోకి కట్ అవుట్‌కు తగ్గ కథ పడితే బొమ్మ బ్లాక్ బస్టర్ అవడం ఖాయం అనడంలో సందేహం లేదు. మరి.. ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో.. సందీప్ ఎలాంటి ఇమేజ్ క్రియేట్ చేసి పెడతాడో చూడాలి.



