నందమూరి నటసింహం బాలకృష్ణ చివరిగా బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో అఖండ 2 తాండవంతో ఆడియన్స్‌ను పలకరించిన సంగతి తెలిసిందే. ఇక ప్రజెంట్ బాలయ్య నెక్స్ట్ ప్రాజెక్ట్‌ల విషయంలో ఆడియన్స్‌లో సందేహాలు మొదలయ్యాయి. డైరెక్టర్ల లైనప్ గురించి.. ఇంట్రెస్టింగ్ టాక్ వైరల్ గా మారుతుంది. ఇప్పటికే బాలయ్య, గోపిచంద్ మల్ఇనేనితో తను నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఎన్బికె 111 రన్నింగ్ టైటిల్‌తో ఈ సినిమా రూపొందనుంది. ఈ సినిమాలో హీరోయిన్గా నయనతార నటించనుంది. ఇక తాజాగా బాలయ్యకు సంబంధించిన మరొ క్రేజి అప్డేట్ ప్రస్తుతం వైరల్ గా మారుతుంది. టాలీవుడ్ అంతర్గత వర్గాల సమాచారం ప్రకారం.. ఎన్బికే 111 తర్వాత.. కొరటాల శివ డైరెక్షన్ లో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడట. ఇందులో వాస్తవం ఎంతో తెలియదు గాని.. నిజంగానే కొరటాల, బాలయ్య కాంబినేషన్ ఫిక్స్ అయితే మాత్రం కచ్చితంగా అది సెట్స్‌పైకి రాకముందే టాక్ ఆఫ్ ది టౌన్ గా మారుతుంది.

ఇప్పటికే.. కొరటాల శివకు స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ సినిమాలు తెరకెక్కించి సక్సెస్ కొట్టిన హిస్టరీ ఉంది. ప్రభాస్‌తో మిర్చి, మహేష్ బాబుతో భరత్ అనే సినిమాలు బ్లాక్ బస్టర్లు గా నిలిచాయి. కాగా.. మెగాస్టార్ చిరు, గ్లిబల్ హీరో చరణ్ ఆచార్య మాత్రం భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఈ క్రమంలోనే లాంగ్ బ్రేక్ తర్వాత ఎన్టీఆర్ దేవరతో ఆడియన్స్‌ను పలకరించాడు కొరటాల. ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. సినిమా తర్వాత దేవర పార్ట్ 2 విషయంలో కొరటాల ప్రయత్నాలు చేసిన.. ఎన్టీఆర్ బిజీ లైనప్ కారణంగా అది అంతకంతకు ఆలస్యం అవుతుంది. ఈ క్రమంలోనే.. దేవర 2 ఆగిపోవచ్చు అంటూ వార్తలు కూడా వినిపించాయి. అంతేకాదు.. ఇప్పటికే కొరటాల ఎలాంటి కొత్త ప్రాజెక్టులు అనౌన్స్ చేయకుండా.. ఏడాదికి పైగా ఖాళీగానే ఉంటున్నాడు.

మరోవైపు టాప్ హీరోలంతా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ బిజీగా గడిపేస్తున్నారు. ఈ క్రమంలోనే సీనియర్ హీరోలతో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడట. గతంలో చిరంజీవితో సినిమా వల్ల డిజాస్టర్ రిజల్ట్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. ఈ సారి బాలయ్య తో సినిమా చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాడట. ఇక బాలకృష్ణ ఇప్పటివరకు వరుసగా ఐదు సినిమాలతో రూ.100 కోట్ల క్రాస్ ను కొల్లగొట్టిన.. ఫ్యామిలీ ఆడియన్స్ బాలయ్య సినిమాలకు కనెక్ట్ కాలేకపోతున్నారు. ఈ క్రమంలోనే రూ.200 నుంచి రూ.250 కోట్ల భారీ స్థాయి కలెక్షన్స్ లో టచ్ చేయలేకపోయాడు. ఇక కొరటాలకు స్క్రీన్ ప్లే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మాస్‌తో పాటు క్లాస్ టచ్ ఇస్తూ ఆడియన్స్ కు తగ్గట్టు సినిమాలను రూపొందిస్తాడు. అది బాలయ్యకు సెట్ అయ్యేలా ఎలాంటి స్టోరీని ఫిట్ చేస్తాడో.. వీళ్లిద్దరు కాంబోలో సినిమా నిజంగానే సెట్స్ పైకి వస్తుందా లేదా చూడాలి.

