మళ్లీ పెళ్లి తర్వాత సమంత షాకింగ్ డెసిషన్.. ఫ్యాన్స్ మాత్రం ఫుల్ హ్యాపీ..!

సౌత్ స్టార్ హీరోయిన్‌గా తిరుగులేని ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న సమంత రూత్ ప్ర‌భుకు ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచ‌యాలు అవసరం లేదు. కేవలం సౌత్‌లోనే కాదు.. ఇటీవల బాలీవుడ్‌లో నటించే సత్తా చాటుకున్న ఈ అమ్మడు.. వ్యక్తిగతంగాను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. ఇక తన పర్సనల్ లైఫ్ లో ఎన్నో క‌ష్టాలు వ‌చ్చినా.. సమంత సినిమాల పరంగా తనకున్న ఫ్యాషన్ మాత్రం ఎప్పుడు విడవలేదు. తాజాగా సమంత.. దర్శక,నిర్మాత అయిన రాజ్ నిడమోరును రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా.. పెళ్తై పట్టుమని వారం రోజులు కూడా కాకముందే.. సమంత తీసుకున్న ఓ డెసిషన్ అందరికీ షాక్ ను కలిగిస్తుంది.

అసలు మేటర్ ఏంటంటే.. ఈమె పెళ్లైన‌ నాలుగు రోజుల్లోనే హనీమూన్‌కు బ్రేక్ తీసుకోకుండా.. మళ్ళీ సెట్స్ లోకి అడుగు పెట్టడం హాట్ టాపిక్. ఇక సాధారణంగా స్టార్ హీరోయిన్లు ఎవరైనా పెళ్లి తర్వాత కనీసం రెండు, మూడు నెలల పాటు హనీమూన్, ఫ్యామిలీ ట్రిప్స్ అంటూ వెకేషన్ ఎంజాయ్‌ చేస్తారు. కానీ.. సమంత మాత్రం దాని బ్రేక్ చేసింది. ఎంజాయ్మెంట్ కాదు.. ఫ్యాషన్ ముఖ్యమని.. వర్క్ ఇస్ వర్షిప్ అనే సిద్ధాంతాన్ని ఆమె ఎప్పుడు బలంగా నమ్ముతారు. దీన్నే.. ఇంప్లిమెంట్ చేసింది. తన కమిట్మెంట్ ను నిలబెట్టుకోవడం కోసం హనీమూన్ ప్లాన్ కూడా వాయిదా వేసిందని సమాచారం. నేరుగా.. షూటింగ్ సెట్స్‌లోకి అడుగుపెట్టింది. ఇక సామ్ తీసుకున్న‌ డెసిషన్‌తో సమంతకు సినిమాపై ఉన్న ఫ్యాషన్ ఏంటో మరోసారి రుజువైంది. ఇక.. సమంత గతంలో భయంకరమైన వ్యాధిని ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.

అనారోగ్యం నుంచి బయటపడిన తర్వాత ఆమె సెలెక్ట్ చేసుకుంటున్న ప్రతి సినిమా విషయంలోను ఆచితూచి అడుగులు వేస్తుంది. ఇలాంటి క్రమంలో ఆమె తాజాగా నటిస్తున్న మూవీ మా ఇంటి బంగారం. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నారట. అందుకే తన సొంత హ్యాపీనెస్ ను ప్లాన్స్‌ను వదిలేసి.. ఫ్యాషన్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిందని తెలుస్తుంది. ఇప్పటికే సమంత ఇండస్ట్రీలో ఎన్నో కష్టాలు, విమర్శలు ఎదుర్కొన్నా.. స్ట్రాంగ్ గా నిలబడింది. డిసిప్లిన్, కమిట్మెంట్ను వదులుకోకుండా తెలుగు సినిమాలు అంటే ఏంటో సాటి చెప్పింది. అయితే.. తాజాగా మళ్లీ.. పెళ్లి తర్వాత అమ్మడు 4 రోజుల వ్యవధిలోనే షూట్ లోకి అడుగుపెట్టడంతో.. ఫ్యాన్స్ అయితే ఆమె డెడికేషన్ చూసి ఫీదా అవుతున్నారు. అందుకే సమంత కేవలం నటి కాదు.. లేడీ సూపర్ స్టార్ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.