స్టార్ బ్యూటీ సమంత తన రూమర్ట్ బాయ్ ఫ్రెండ్.. దర్శకనిర్మాత రాజ్ నిడమోరుతో వివాహ బంధంలోకి అడుగు పెట్టింది. సోమవారం తెల్లవారుజామున కోయంబత్తూర్‌లోని ఈషా యోగ సెంటర్లో.. లింగ బైరవి దేవాలయంలో రాజ్ నిడమోరును పెళ్లాడింది. రెడ్ శారీలో సమంత , క్రీం – గోల్డ్ కలర్ కుర్తిలో రాజ్ తళ్లుకున మెరిశారు. ఇక వీళ్లిద్దరికి సంబంధించిన పెళ్లి ఫోటోలను సమంత సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. అయితే.. సమంత – రాజ్‌లకు ఈషా ఫౌండేషన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ.. అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చింది. అందులో వీళ్ళిద్దరూ భూత శుద్ధి వివాహం చేసుకున్నారంటూ పేర్కొన్నారు.
ఇంతకీ ఈ భూత శుద్ధి వివాహం ఏంటి.. అసలు దీని స్పెషాలిటీ ఏంటో అని సందేహాలు అందరిలోనూ మొదలైపోయాయి. ఆ వివరాలు ఒకసారి తెలుసుకుందాం. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితల సమక్షంలో జరిగిన ఈ పెళ్లి వేడుక.. అనధిగా వస్తున్న యోగ సాంప్రదాయం ప్రకారం నిర్వహించారు. ఆలోచనలు, ఎమోషన్స్ లేద భౌతికతకు అతీతంగా.. ఓ జంట మధ్యలో డీప్ బాండ్ ఏర్పరచడానికి రూపొందించే.. ఓ విశిష్ఠమైన ప్రక్రియ ఇది. ఈ భూత శుద్ధి వివాహం.. లింగ బైరవ ఆలయాల్లో ఎంపిక చేసిన కొన్ని ప్రదేశాల్లో ఈ వివాహ క్రతవు నిర్వహిస్తూ ఉంటారు.

వధూవరుల దేహాల్లోని పంచభూతాలను శుద్ధి చేస్తూ.. వారి దాంపత్య ప్రయాణంలో.. సామ్రాస్మం, శ్రేయస్సు, ఆధ్యాత్మికత వెల్లి వెరిసేలా ఈ వేడుకన్ను జరుపుకుంటారు. ఇక ఈ విధానంతో.. ఆ దేవి అనుగ్రహం కలుగుతుందని ఈషా ఫౌండేషన్ తమ ప్రకటనలో వెల్లడించింది. ఎప్పటినుంచో సమంత, రాజ్ డేటింగ్ వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక కొద్దిసేపటి క్రితం సమంతా తమ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియా వేదిక షేర్ చేయడంతో నెటిజన్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

