RC 17: పుష్పా రేంజ్.. చరణ్ కోసం సుక్కు మాస్టర్ స్కెచ్..!

టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ పుష్ప, పుష్ప 2లతో పాన్ ఇండియా లెవెల్ లో సాలిడ్ బ్లాక్ బస్టర్లు అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సుకుమార్ ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయంలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇంటర్నేషనల్ లెవెల్లో హైప్‌ మొదలైంది. పుష్పరాజు పాత్రలో అల్లు అర్జున్ నటన‌తో ఆడియన్స్ కు పూనకాలు తెప్పించేలా చేయడంతో సుకుమార్ సూపర్ సక్సెస్ అందుకున్నాడు. అంతేకాదు పుష్ప పార్ట్ 3 కూడా ఉంటుంది ఇప్పటికే అనౌన్స్ చేశారు. కానీ దానికి మరింత సమయం పట్టెలా ఉంది. ఈ క్రమంలోనే సుకుమార్ త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం రామ్ చరణ్‌ను ఎంచుకున్నాడు. ఇప్పటికే.. వీళ్లిద్దరు కాంబలో మూవీ అఫీషియల్‌గాను ప్ర‌క‌టించారు.

ఇక సినిమా హార్స్ బ్యాక్ డ్రాప్‌లో వస్తుందని కొందరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు రంగస్థలం పార్ట్ 2 అంటూ చెబుతున్నారు. మరి పుష్ప తర్వాత సుకుమార్ చేస్తున్న సినిమా కావడంతో.. ఆ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ఆడియన్స్‌లో మొదలైపోయ్యాయి. ఇక గతంలో.. చరణ్‌తో రంగస్థలం సినిమా చేసి.. బాహుబలి రికార్డులను బ్రేక్ చేసిన సుక్కు.. పుష్ప సక్సెస్ తో మరింత ఇమేజ్ను పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే.. పుష్ప మ్యాజిక్‌ను మళ్లీ రిపీట్ చేస్తాడా.. లేదా.. పుష్పను మించిపోయే రేంజ్‌లో చరణ్‌తో సినిమా ఉంటుందా.. లేదా.. అని సందేహాలు అందరిలోనూ మొదలయ్యాయి. ఇక.. పుష్ప సినిమాకు అన్నింటికన్నా ఎక్కువ క్లిక్ అయింది పుష్పరాజ్ క్యారెక్టర్జేష‌న్. స్క్రీన్ ప్లే, స్టోరీ తో పాటు పుష్పరాజ్ క్యారెక్టర్ కూడా చాలా హైలైట్ గా మారింది.

Pushpa 2 director Sukumar reviews Ram Charan's Game Changer: 'He will get a  National Award for the performance'

కాగా ఆర్సి 17 సినిమా విషయంలో కూడా చరణ్ కు ఆ రేంజ్ లో బలమైన క్యారెక్టర్జను డిజైన్ చేసుకున్నాడట సుకుమార్. ప్రస్తుతం పెద్ది సినిమా షూట్ లో చ‌ర‌ణ్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత సుకుమార్ మూవీ సెట్స్ పైకి రానుంది. సుకుమార్ రంగస్థలం 2 కథతో వచ్చినా.. మరే కథతో వచ్చిన.. పుష్ప రేంజ్ ను బ్రేక్ చేసేలా చరణ్ మూవీ ఉండాలని అభిమానులు ఆశపడుతున్నారు. ఇక‌ సుకుమార్ సైతం పుష్ప 3 కంటే ముందు చరణ్‌తో తీయబోయే సినిమాతో.. మరోసారి తన స్టామినా ఏంటో చూపించాలని ఫిక్స్ అయ్యాడట. ఇక చరణ్ ఒకసారి కంటెంట్ నచ్చితే.. సినిమా కోసం ఎలాంటి రిస్క్ చేయడానికి అయినా గ్రీన్ సిగ్నల్ ఇస్తాడన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. సుక్కు, చరణ్‌ కాంబినేషన్‌లో వచ్చే సినిమా ఎలా ఉండబోతుందో అనే ఎక్సైట్మెంట్ మెగా అభిమానుల్లో మొదలైపోయింది.