టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో హొంబలే ప్రొడక్షన్ ఇప్పటికే మూడు సినిమాలను సైన్ చేయించుకుని అఫీషియల్ గా అనౌన్స్ చేసి కూడా చాలా కాలం అయిపోయింది. వాటిలో ఒకటి సాలార్ పార్ట్ 2 అని అందరికీ తెలుసు. కానీ.. మరో రెండు సినిమాలు ఏమై ఉంటాయని ఆసక్తి, సస్పెన్స్ అలాగే ఉండిపోయాయి. తాజాగా.. రెబల్ స్టార్ ప్రభాస్ తో ఆల్రెడీ సాహో చేసిన.. క్రేజీ డైరెక్టర్ సుజిత్‌తోనే బ్యానర్ రెండో సినిమాను ప్లాన్ చేసిందని తెలుస్తుంది. సాహో సినిమా కమర్షియల్ సక్సెస్ అందుకోకపోయినా.. రెబల్ స్టార్ ఫ్యాన్స్‌కు మాత్రం ఎవర్గ్రీన్ ట్రీట్ గా మిగిలిపోయింది.

ప్రభాస్ ను ఎలా అయితే చూడాలనుకున్నారో అదే రేంజ్ లో సుజిత అయినను చూపించారు. ఇక ఈ సినిమా తర్వాత చాలా గ్యాప్ తో పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా చేసి హిట్ కొట్టాడు. సుజిత ఈ సక్సెస్ నేపథ్యంలో.. నిర్మాతల నుంచి స్టార్ హీరోల వరకు అంతా ఆయనతో సినిమా చేసేందుకు ఇష్టపడుతున్నారు. దీంతో ఇప్పటికే ఎలాగో ప్రభాస్ అగ్రిమెంట్ ఉండనే ఉంది.. దీంతో హొంబాలే ఫిలిం సుజిత్‌ను రంగంలోకి దింపారట. అయితే.. వీళ్ళిద్దరి కాంబోలో సాహో సీక్వెల్ ఉంటుందా.. లేదా ఓజి యూనివర్సిటీలోనే ప్రభాస్ తో మరో సినిమా వస్తుందా.. అనే సందేహాలు మొదలయ్యాయి.
కారణం ఓజీ సినిమాలో సాహూ గురించి సుజిత్ హింట్ ఇచ్చి వదలడం. మరి. సస్పెన్స్ ఎప్పటికి వీడుతుందో తెలియదు గానీ.. వీళ్ళిద్దరి కాంబోలో హొంబాలే మళ్ళీ సినిమా అనడంతో ఆడియన్స్‌లో మాత్రం మంచి హైప్ మొదలైంది. 2027 నాటికి ప్రభాస్ తన పెండింగ్ ప్రాజెక్ట్‌లను కంప్లీట్ చేసి.. సుజిత సినిమా సెక్స్ లోకి అడుగుపెడతాడట. ఈ లోపు.. సుజిత్ కూడా నానితో ప్రాజెక్టును కమిట్ అయ్యాడు. దానిని కంప్లీట్ చేసి ప్రభాస్ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనిలో పడతాడని సమాచారం. ఏదేమైనా మళ్లి వీళ్ల కాంబో రిపీట్ అవుతున్న క్రమంలో రెబల్ స్టార్ ఫ్యాన్స్‌కు ఆనందాన్ని కల్పిస్తుంది.

