గాడ్ ఆఫ్ మాసేస్ బాలయ్య, సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి కాంబో లేటెస్ట్ మూవీ అఖండ 2 తాండవం మరి కొద్ది గంటల్లో ప్రీమియర్లతో ఆడియన్స్‌న పలకరించేందుకు సిద్ధమవుతోంది. మొదట ఈ సినిమాను డిసెంబర్ 5న రిలీజ్ చేయాలని ప్లాన్ చేసినా కొన్ని కారణాలతో సినిమా రిలీజ్ కొద్ది గంటల ముందు వాయిదా పడి అందరికి షాక్ ఇచ్చింది. అయితే సినిమా కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. ఇక డిసెంబర్ 12న ఈ మూవీ గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే డిసెంబర్ 11 అంటే నేడు రాత్రి 10గంటల నుంచి తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్ పడనున్నాయి. ఇక ఈ సినిమా దాదాపు 103 కోట్ల వరకు ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుందని సమాచారం. ఈ క్రమంలోనే బాలయ్య నటించిన గత 10 సినిమాల ఫ్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఆ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం.

2017 లో బాలకృష్ణ హీరోగా.. క్రిష్ డైరెక్షన్లో తెరకెక్కిన మూవీ గౌతమిపుత్ర శాతకర్ణి.. రూ.46 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది. ఈ సినిమా తర్వాత పూరి జగన్నా డైరెక్షన్‌లో పైసా వసూల్ మూవీ రూ.32.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది. తర్వాత బాలయ్య హీరోగా నటించిన మరో మూవీ జై సింహ.. కే.ఎస్. రవికుమార్ డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా రూ.26 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరుపుకుంది. తర్వాత ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో బాలయ్య నటించారు. ఈ సినిమాకు దాదాపు రూ.70.60 కోట్ల ప్రీ బిజినెస్ జరగడం విశేషం.

ఈ సినిమా తర్వాత రూలర్ సినిమాకు రూ.23.75 కోట్లు, తర్వాత వచ్చిన అఖండకు రూ.53 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఈ సినిమాతో బాలయ్య ఎలాంటి సంచలనాలు సృష్టించడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలయ్యకు ఈ సినిమా స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చింది. అలా తర్వాత ఆయన నటించిన వీర సింహారెడ్డికి రూ.73 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా.. ఈ సినిమా తర్వాత వచ్చిన భగవంత్ కేసరి కి రూ. 67.35 కోట్ల, తర్వాత నటించిన డాకు మహారాజ్ కు రూ. 80 .50 కోట్లు బిజినెస్ జరిగింది. ఇక కొద్ది గంటల రిలీజ్ కానున్న అఖండ తాండవం కు రూ.103 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ కాగా.. భారీ టార్గెట్ తో రంగంలోకి దిగుతుంది. అంతేకాదు బాలయ్య కెరీర్లో మొదటి పాన్ ఇండియన్ సినిమా ఇదే కావడం విశేషం, ఈ సినిమాతో బాలయ్య ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడో.. ఏ రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేస్తాడో చూడాలి.

