సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డివంగా పుట్టినరోజు సెలబ్రేషన్స్‌లో భాగంగా.. నేడు రెబల్ స్టార్ ప్రభాస్ సోషల్ మీడియా వేదికగా.. సందీప్‌కు తన మార్క్ స్టైల్‌లో విషెస్ తెలియజేసాడు. వరుసగా.. భారీ హిట్లను అందించిన సందీప్ రెడ్డి వంగ పేరు చెప్తే చాలు ఫ్యాన్సులో ఓ వైబ్ మొదలైపోతుంది. ఈ క్రమంలోనే.. సందీప్ రెడ్డివంగాకు సెలబ్రిటీస్ నుంచి ఫ్యాన్స్ వరకు చాలామంది సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలియజేస్తున్నారు. ఇందులో భాగంగానే రెబల్ స్టార్ ప్రభాస్ ఈ పోస్ట్‌లో హ్యాపీ బర్త్డే బ్రో.. నువ్వు సృష్టిస్తున్నది అందరూ చూసే రోజు కోసం వెయిట్ చేస్తున్నాను అంటూ తనదైన స్టైల్ లో విషెస్ తెలియజేశాడు.
ఈ కామెంట్స్ లో తమ రాబోయే సినిమా స్పిరిట్ పై ప్రభాస్‌కు ఉన్న నమ్మకం ఏంటో అర్థం అయిపోతుంది. ఈ క్రమంలోనే అభిమానుల్లో సినిమా పై అంచనాలు సైతం మరింతగా పెరిగాయి. ఇక స్పిరిట్ మూవీ పాన్ ఇండియా లెవెల్‌లో రూపొందుతుంది. ఇక.. తాజాగా సినిమా రెగ్యులర్ షూట్ ప్రారంభం కాగా.. ప్రభాస్ బర్త్డే సెలబ్రేషన్స్‌లో భాగంగా.. ఇటీవల రిలీజైన వాయిస్ ఓవర్ గ్లింప్స్ ఆడియన్స్‌లో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. చిన్న ఆడియో గ్లింప్స్‌తోనే సినిమాకు ఉన్న పవర్ ను చూపించాడు అంటూ సందీప్ పై ప్రశంసలు కురిసాయి.
ఇక ప్రభాస్ కెరీర్‌లోనే మొదటిసారిగా పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. అది కూడా పవర్ఫుల్.. స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ గా ఇప్పటివరకు తను నటించిన అన్ని పాత్రల కంటే భిన్నంగా.. రఫ్ రగడ లుక్ లో కనిపించానన్నాడట. ఈ క్రమంలోనే సినిమాతో ఎలాంటి రిజల్ట్ అందుకున్నా.. ప్రభాస్‌కు మాత్రం ఒక కొత్త ఇమేజ్ క్రియేట్ అవుతుంది అని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇక.. సినిమాలో త్రిప్తి డిమ్రి హీరోయిన్గా మెరవనుంది. ఆమె పాత్ర చాలా కీలకంగా ఉండనిందుని సమాచారం. ప్రభాస్ స్క్రీన్ ప్రజెన్స్ సందీప్ మార్క్ కంటెంట్‌తో వస్తున్న ఈ సినిమా ఆడియన్స్‌ను ఎలా ఆకట్టుకుంటుందో.. ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.



