జోరు పెంచిన చిరు.. ఈసారైనా హిట్ పక్కానా..!

టాలీవుడ్‌ మెగాస్టార్ చిరంజీవి ఏడు పదుల వయసులోను వరుస సినిమాలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ముఖ్యంగా.. తన కొడుకు చరణ్‌తో పోటీగా సినిమాలు చేస్తూ ఆకట్టుకున్నాడు. ఇక తన ఫ్యూచర్ ప్రాజెక్టులతో సాలిడ్ సక్సెస్‌లు కొట్టాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నాడు. అందులో భాగంగానే చివరిగా ఆయన నటించిన మూవీ మన శంకర వరప్రసాద్ గారు.. పండక్కి వస్తున్నారు ఒక‌టి. సక్సెస్‌ఫుల్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో.. నయనతార హీరోయిన్గా మెరవనుంది. ఓటమి ఎరుగ‌ని అనిల్ రావిపూడి, మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడం.. మరో సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో నటిస్తూ ఉండడంతో సినిమా పై ఇప్పటికే ఆడియన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

వచ్చే ఏడాదికి సంక్రాంతి వల్ల జనవరి 12న గ్రాండ్‌గా సినిమా రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే మేకర్స్ అదిరిపోయే అప్డేట్స్‌ను రివిల్ చేస్తూ ఆడియన్స్‌లో ఉత్సాహాన్ని మరింతగా పెంచుకున్నారు. ఇక.. తాజాగా సినిమా నుంచి మరో పోస్టర్‌ను షేర్ చేసుకున్నారు. అందులో చిరంజీవి యాక్షన్ సీక్వెన్స్‌లో దూకుడు కనిపిస్తూ.. స్టైలిష్ లుక్‌లో మెప్పించారు. ఇక ఈ తాజా పోస్టర్‌లో చిరంజీవికి గాయం జరిగినట్లు.. ఒక చేతిలో గన్ పట్టుకుని, మరో చేత్తో నడుము పై చేయి పెట్టి స్టైలిష్ గా నుంచున్న లుక్ ఫ్యాన్స్ తో పాటు.. సాధారణ ఆడియన్స్‌ను సైతం ఆకట్టుకుంటుంది. రౌద్రంతో పాటు.. స్టైల్ ని కూడా కలిపి కొట్టాడు అంటూ చిరంజీవి లుక్ పై ఫ్యాన్స్ పాజిటివ్‌గా రియాక్ట్ అవుతున్నారు. ఈ క్రమంలోనే సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయ‌ని చెప్పొచ్చు. ఇక.. సినిమా రిలీజ్‌కు మరో 19 రోజులు మాత్రమే టైం ఉన్న క్రమంలో.. అనిల్‌తో పాటు.. చిరు సైతం ప్రమోషన్స్‌లో జోరు చూపిస్తున్నారు.

Vishwambhara Teaser | Vishwambhara Trailer | Chiranjeevi | Movie Mahal

వారానికి రెండు మూడు అప్డేట్లు ఇస్తూ.. ఈసారి ఎలాగైనా బ్లాక్ బస్టర్ కొట్టాలని ప్రయత్నిస్తున్నారు. మరి ఈసారైనా చిరు అనుకున్న రేంజ్‌లో సక్సెస్ అందుకుంటాడా.. లేదా తెలియాలంటే వెయిట్ చేయాలి. చివరిగా భోళా శంకర్ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించినా.. ఆ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఫ్యాన్స్‌లో నిరుత్సాహం మిగిలింది. మరోపక్క.. డైరెక్టర్ మల్లిడి వశిష్టాతో విశ్వంభ‌ర‌ సినిమా చేసి.. రెండేళ్లు పూర్తవుతున్నా.. ఇప్పటివరకు రిలీజ్ వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తుంది. దీంతో సినిమాలు వచ్చే ఏడాది సమ్మర్‌లో రిలీజ్ చేస్తున్నారు. అలాగే మరోవైపు డైరెక్టర్ బాబి కొల్లితో.. చిరంజీవి మరో కొత్త సినిమాకు సైన్ చేసాడు. అయితే.. మ‌న శంక‌ర వ‌ర‌ప్రసాద్ గారు పనిలో పూర్తయిన తర్వాత సెట్స్‌పైకి తీసుకోచ్చి.. ఏడాది చివరికల్లా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. ఈ క్రమంలోనే.. చిరంజీవి సినిమాల విషయంలో జోరుని పెంచారని.. ఒకే ఏడాదిలో మూడు సినిమాలకు ప్లాన్ చేశారంటూ.. ఈ సినిమాలతో రెండు సినిమాలు హిట్ కొట్టిన చాలు.. ఆయన మళ్లీ స్ట్రాంగ్ కమ్‌ బ్యాక్ ఇవ్వడం కాయమంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Megastar Chiranjeevi surprises director Bobby with a special gift on his  birthday. Watch - India Today