బిగ్ బాస్ 9: విన్నింగ్ రేస్ లో దూసుకొస్తున్న డిమోన్.. చివరి వారంలో బిగ్ ట్విస్ట్..

బిగ్ బాస్ సీజన్ 9 ర‌స‌వ‌తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మరో రెండు రోజులు మాత్రమే టైం ఉన్న క్రమంలో.. టైటిల్ రేస్‌లో విన్నర్ ఎవరనే ఆసక్తి కేవలం బిగ్ బాస్ ఫాన్స్‌లోనే కాదు.. సాధార‌ణ‌ ఆడియన్స్‌లోను మొదలైంది. నిన్న‌ మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ పడాల, తనుజ పుట్టస్వామి మధ్యన.. ఈ విన్నర్ రేస్‌లో స్ట్రాంగ్ కాంపిటీషన్ ఏర్పడగా.. తాజాగా డిమాన్‌ పవన్‌ గ్రాఫ్ లోకి దూసుకొచ్చాడు. అసలు.. టాప్ 5 వరకు అయినా డిమాన్‌ ఉంటాడా అనే పరిస్థితి నెల‌కొన్నా.. అన్నింటినీ ఎదుర్కొంటూ చివరి అంకానికి చేరుకున్నాడు.

రీతు ఎలిమినేషన్ తర్వాత.. పవన్ గేమ్ మరింత పుంజుకుంది. టాస్కులు మాత్రమే కాదు.. హౌస్ మేట్స్‌తో బాగా కలిసిపోతూ.. ఫుల్ ఎంజాయ్ చేస్తూ కనిపిస్తున్నాడు. ఇక.. హౌస్‌లోకి అడుగు పెట్టినప్పటి నుంచి.. రివైండ్ టాస్కులు చేస్తూ.. బిగ్ బాస్ పెట్టిన ప్రతి టాస్క్‌లోను అదరగొట్టాడు. తన ఆట తీరుతో.. సరైన ఛాన్స్ వస్తే ఎలా ఆడగలడో ప్రూవ్ చేసుకున్నాడు. ఇక ఫైనల్ వీక్‌లో జరిగిన టాస్క్‌లు అయితే.. తన పూర్తి ఎఫర్ట్స్‌ కనిపించాయి.

ఈ క్రమంలోనే.. పవన్, తనూజ టాప్ 2 లో ఉండగా.. ఇమ్మును పక్కకు తప్పించి టాప్ 3 కి డిమాన్‌ దూసుకొచ్చాడు. భారీ లెవెల్లో డిమాన్‌కు ఓట్లు పడుతున్నాయని సమాచారం. అయితే.. చివరి రెండు వారాల్లో డిమాన్‌ చూపించిన దూకుడు.. మొదటి నుంచి చూపించుంటే కచ్చితంగా టాప్ 2లో ఉండేవాడని.. విన్నర్ రేస్‌లో ట్రోఫీని అందుకునే పరిస్థితి నెలకొనేదంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఏదేమైనా.. మరికొంత టైం మిగిలే ఉంది. ఈ టైంలో.. ఓటింగ్ తారుమారై పొజిషన్స్ మారినా ఆశ్చర్యపోనవసరం లేదు. మరి.. ఈ టాప్ 3లో విన్నర్‌గా ట్రోఫీ ఎవరందుకుంటారో ఎవరు గెలుస్తారో తెలియాలంటే ఆదివారం వరకు వెయిట్ చేయాల్సిందే.