అఖండ 2 వాయిదా.. టాలీవుడ్ కు ఓ గుణపాఠమా..

ఇండస్ట్రీ అంటేనే పెద్ద బిజినెస్ రంగంగా మారిపోయింది. ఒక సినిమాను నిర్మించడం అంటేనే బిగ్ టాస్క్ అంటే.. ఆ సినిమా రిలీజ్ చేయడం మరింత కష్టంగా మారింది. సినిమా రిలీజ్‌లోపు ఏ చిన్న ఇష్యూ వస్తున్న.. రిలీజ్ డేట్ పై ఆ ప్రభావం కనిపిస్తుంది. ఈ క్రమంలోనే స్టార్ హీరోల సినిమాలు సైతం అంత సిద్ధమై.. చివరకు వచ్చిన తర్వాత వాయిదా పడుతున్న పరిస్థితి. తాజాగా నందమూరి నట‌సింహం బాలకృష్ణ అఖండ 2 సినిమా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇక్కడ ఎవరి లెక్కలు వాళ్లకు ఉంటాయని.. చిన్న హీరోలే కాదు.. ఎంత పెద్ద స్టార్ హీరోలు సినిమాలైనా లెక్కల్లో తేడా వస్తే ఆగిపోవాల్సిందేనని మరోసారి ఈ పరిణామంతో రుజువైంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ముందుగా మేకర్స్ చెప్పిన‌ట్లు డిసెంబర్ 5న గ్రాండ్ లెవెల్ లో ఈ మూవీ రిలీజ్ అయ్యేది.

ఇప్పటికి రివ్యూ కూడా తెలిసిపోయేది. ఫస్ట్ డే కలెక్షన్స్ లెక్కల సోషల్ మీడియాలో మూత మోగిపోయేవి. కానీ.. ఈ సినిమా లాస్ట్ మినిట్ లో వాయిదా పడింది. ముందుగా ప్రీమియర్స్ రద్దు చేసిన నిర్మాతలు.. తర్వాత సినిమా రిలీజ్‌ను కూడా ఆపేశారు. దీంతో.. ఫ్యాన్స్‌కు బిగ్ షాక్ తగిలింది. సినీ ఇండస్ట్రీలో సినిమాలు వాయిదా పడడం ఇటీవల కామన్ అయిపోయింది. టెక్నికల్ ఇష్యూలు లేదా.. ప్రీ బిజినెస్ కాకపోవడం, ఫైనాన్షియల్ ప్రాబ్లంస్ ఇలా ఏ కారణమైన సినిమా వాయిదా పట్టడం.. వారం పది రోజులు ముందే తెలిసేది. కానీ.. అఖండ‌ విషయంలో అలా కాదు.. కేవలం గంటల వ్యవధిలో సినిమాను ఆపేశారు. బాలయ్య కేరీర్‌లోనే ఇది మొదటిసారి అని చెప్పొచ్చు. ఫైనాన్షియ‌ల్ ఇష్యూలతో సినిమా రిలీజ్ ఆలస్యం అవ్వడం కామన్. చాలామంది ఇండస్ట్రీ పెద్దలు చర్చించుకుని ఈ సమస్యలను పరిష్కరించిన సందర్భాలు ఉన్నాయి.

ఇటీవల పవన్ కళ్యాణ్ వీరమల్లు సినిమా విషయంలో ఇదే జరిగింది. చివరి నిమిషంలో పవన్ ఎంట్రీ ఇచ్చి సినిమా రిలీజ్ వాయిదా పడకుండా ఆపగలిగాడు. అఖండ 2 విషయంలో ఇలాగే జరుగుతుందని అంతా అనుకున్నారు. కానీ.. ఎవరు ఊహించిన విధంగా సినిమా ఆగిపోయింది. ఆర్థిక సమస్యలు పరిష్కరించుకున్న తర్వాతే సినిమా రిలీజ్ చేయాలని కోర్ట్ ఆదేశించింది. ఈ క్రమంలోనే టాలీవుడ్‌కు ఇది మంచి గుణపాఠం అని.. ఫైనాన్షియల్ విషయాలని తేలిగ్గా తీసుకొని తర్వాత చూసుకోవచ్చని వదిలేస్తే మాత్రం అకండ 2 పరిస్థితి తప్పదని.. ఏదేమైనా రిలీజ్ కు ముందే ఫైనాన్షియల్ ఇష్యూస్ మేకర్స్ క్లియర్ చేసుకోవాలని.. ఇప్పటికైనా టాలీవుడ్‌కు కనువింప కలగాలంటే పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. లేదంటే సినిమాలో రిలీజ్ విషయంలో ఆఖరి క్షణం ఎలాంటి ఇబ్బందులు తప్పవు. దీంతో సినిమాపై భారీ ప్రభావం పడే అవకాశం ఉంటుంది.