అఖండ 2 కి కొత్త తలనొప్పి.. బాలయ్యకు షాక్ ఇచ్చిన తెలంగాణ గవర్నమెంట్..!

బాలయ్య – బోయపాటి కాంబోలో రూపొందిన మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ అఖండ 2 మరికొద్ది గంటల్లో గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి సినిమా డిసెంబర్ 5న రిలీజ్ కావాల్సి ఉండగా ఫైనాన్స్ ఇష్యుల కారణంగా ప్రీమియర్ షోస్ కు కొద్ది గంటల ముందు సినిమా ఆగిపోయింది. తాజాగా ఆ సమస్యలనింటిని పరిష్కరించి.. డిసెంబర్ 12న సినిమా రిలీజ్ చేసేందుకు మేకర్స్ అంతా సిద్ధం చేశారు. పాన్ ఇండియా లెవెల్లో ఆడియన్స్‌ను పలకరించనున్న ఈ సినిమాకు డిసెంబ‌ర్‌11న (ఈ రోజు) రాత్రి 10 గంటల నుంచి ప్రీమియర్స్ పడనున్నాయి.

ఈ క్రమంలోనే.. థియేటర్ల వద్ద బాలయ్య అభిమానుల్లో సందడి మొదలైంది. అయితే.. ఈ సినిమా ప్రీమియర్స్ కోసం టికెట్ రేట్ల హైక్‌కు రెండు తెలుగు రాష్ట్రాల గవర్నమెంట్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తూ జీవోలు పాస్ చేశారు. ఈ క్ర‌మంలోనే అఖండ 2 ప్రీమియర్ టికెట్లను రూ.600గా ఫిక్స్ చేశారు. అంతేకాదు.. ఇప్పటికే బుకింగ్స్ ఓపెనై చాలామంది ఫ్యాన్స్‌ ఇదే కాస్ట్ కు టికెట్ ను కూడా కొనుగోలు చేశారు. ఇలాంటి క్రమంలో అఖండ 2 టీంకు మళ్లి షాక్ తగిలిందనే చెప్పాలి.

తెలంగాణ హైకోర్టులో అఖండ 2 సినిమా టికెట్ ధరల పెంపు పై.. లంచ్ మోషన్ పిటిషన్ దాఖలా చేశారు. ప్రభుత్వం ఇచ్చిన జీవోన రద్దు చేయాలంటూ కోర్ట్ ను కోరుతూ న్యాయవాది శ్రీనివాసరెడ్డి పిటిషన్ వేశాడు. కోర్టు కూడా దీనిని అనుమతించి.. విచారణకు ఆదేశాలు ఇచ్చేసింది. అయితే ఇప్పుడు హైకోర్టులో వేసిన ఈ పిటిషన్ కారణంగా తెలంగాణ గవర్నమెంట్ టికెట్ హైక్ జీవోను రద్దు చేయడం అఖండ 2 టీంతో పాటు బాలయ్యకు కూడా బిగ్ షాక్ తగిలిందనే చెప్పాలి. ఇప్పటికే చాలామంది తెలంగాణ ఫ్యాన్స్ బాలయ్య ప్రీమియర్ షో టికెట్ను రూ.600కు కొనుగోలు చేసేసారు. ఈ క్రమంలోనే బుకింగ్స్ విష‌యంలో కన్ఫ్యూ.న్ మొదలైంది. ఇప్పటికే టికెట్లు కొన్న వాళ్లకు ఎలాంటి న్యాయం జరుగుతుంది.. అసలు ముందు ఏం జరగబోతుందో చూడాలి.