” వారణాసి “మహేష్ రెమ్యూనరేషన్ లెక్కలివే.. భారీ ప్లానింగ్..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి సినిమాలో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. వీళ్ళిద్దరి కాంబోలో వస్తున్న మొట్టమొదటి సినిమా కావడం.. గ్లోబల్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ జక్కన్న రూపొందిస్తున్న సినిమా కావడంతో.. ఆడియన్స్‌లో ఈ మూవీ పై మంచి అంచనాలు నెల‌కొన్నాయి. ఇక ఈ మూవీ 2027 సమ్మర్ లో రిలీజ్ చేసేందుకు టీం ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సినిమా అప్డేట్స్ కోసం గ్లోబల్ ట్రోట‌ర్ ఈవెంట్ ను ఏర్పాటు చేసి.. సినిమా టైటిల్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా వారణాసి అనే టైటిల్ ఆఫీషియల్‌గా ప్రకటించారు. 2027 సమ్మర్‌లో ఈ సినిమా ఆడియన్స్‌ను పలకరించనుందంటూ క్లారిటీ ఇచ్చారు.

ఇదిలా ఉంటే.. తాజాగా సినిమాకు సంబంధించిన ఓ టాక్ తెగ ట్రెండ్ అవుతుంది. సినిమా గ్లోబల్ రేంజ్ లో ఆడిమ‌న్స్‌ను పలకరించనున్న క్రమంలో.. మహేష్ బాబు రెమ్యునరేషన్ గురించి వార్తలు తెగ వైరల్ గా మారుతున్నాయి. మహేష్ గతంలో.. ఒక్క సినిమాకు రూ.70 కోట్ల రెమ్యూనరేషన్ను అందుకున్నాడని టాక్ వినిపించింది. ఇక.. తాను చివరగా నటింఇన‌ గుంటూరు కారం సినిమాకి అయితే.. ఏకంగా రూ.78 కోట్ల చార్జ్ చేశాడట మహేష్. ఈ క్రమంలోనే.. వారణాసి సినిమా కోసం మహేష్ అంతకుమించిపోయే రేంజ్ లో రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే మహేష్ బాబు సినిమాకు రెమ్యునరేషన్ను తీసుకోవడం లేదట. పారితోషికాన్ని శాలరీ రూపంలో తీసుకుంటున్నట్లు సమాచారం. సినిమాకు పని చేస్తున్నందుకు ఏడాదికి.. ఇంతా అని శాలరీలా మహేష్.. ఈ సినిమా కోసం ఛార్జ్‌ చేస్తున్నాడట‌. దీన్నిబట్టి.. రాజమౌళి ఎన్ని సంవత్సరాలు మహేష్ బాబును సెట్స్‌లో ఉంచేస్తే అన్ని సంవత్సరాల జీతం మహేష్ తీసుకుంటాడు. ఇక.. జక్కన్న సినిమా అంటే మినిమం రెండు, మూడేళ్ల సమయం పట్టేస్తుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మహేష్ ఇలాంటి క్రేజీ గాల్ కుదుర్చుకున్నాడని టాక్. ఈ క్రమంలోనే మహేష్ మాస్టర్ ప్లానింగ్ చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఇక ఏడాదికి రూ.70 కోట్లు చొప్పున రెమ్యూనరేషన్ తీసుకున్నా.. 3 సంవత్సరాలకు కలిపి మహేష్ దాదాపు రూ.200 కోట్లకు నైగా రెమ్యూనరేషన్ తీసుకుఏ ఛాన్స్ ఉంద‌ని ట్రేడ్ అంచ‌నా.